తెలంగాణ

telangana

ETV Bharat / business

టాటా కార్ లవర్స్​కు​ గుడ్ న్యూస్​ - ఈవీ​ మోడల్స్​ ధర​ ఏకంగా రూ.1.2 లక్షలు తగ్గింపు! - Tata punch ev Price cut

Tata Motors Cuts EV Car Price : టాటా కార్ లవర్స్ అందరికీ గుడ్ న్యూస్​. టాటా కంపెనీ తమ ఎలక్ట్రిక్ కార్ల ధరలను భారీగా తగ్గించింది. టాటా నెక్సాన్​ ఈవీపై రూ.1.2 లక్షలు, టాటా టియాగో ఈవీపై రూ.70వేలు వరకు తగ్గించింది. మిగతా కార్ల ధరలు ఎలా ఉన్నాయంటే?

Tata Nexon ev Price cut
Tata Motors cuts EV Car price

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 5:29 PM IST

Updated : Feb 13, 2024, 5:36 PM IST

Tata Motors Cuts EV Car Price : టాటా మోటార్స్ లవర్స్ అందరికీ గుడ్ న్యూస్​. టాటా కంపెనీ తన లేటెస్ట్ ఈవీ మోడల్స్ -​ నెక్సాన్​, టియాగో కార్ల ధరలను ఏకంగా రూ.1.2 లక్షల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాటరీ ధరలు గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.

  1. Tata Nexon.ev Price : టాటా కంపెనీ టాటా నెక్సాన్ ఈవీ కారు ధరను రూ.1.2 లక్షల వరకు తగ్గించింది. ఇకపై ఈ కారు ధర రూ.14.49 నుంచి ప్రారంభమవుతుంది.
  2. Tata Tiago.ev Price :టాటా కంపెనీ టియాగో ఈవీ కారు ధరను కూడా రూ.70,000 వరకు తగ్గించింది. కాబట్టి దీని బేస్ మోడల్​ ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
  3. Tata Punch.ev Price : టాటా మోటార్ ఇటీవల లాంఛ్ చేసిన పంచ్​ ఈవీ ధరలను మాత్రం తగ్గించలేదు.

"ఎలక్ట్రిక్ కార్ల ధరలను బ్యాటరీలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ బ్యాటరీల ధరలు గణనీయంగా తగ్గాయి. అందుకే ఈ బెనిఫిట్​ను నేరుగా కస్టమర్లకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం."
- వివేక్ శ్రీవాత్సవ, టాటా ప్యాసింజర్​ ఎలక్ట్రిక్​ మొబిలిటీ చీఫ్​ కమర్షియల్ ఆఫీసర్​

ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో వాటిని మరింత అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రయత్నంలో భాగంగా ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు వివేక్ శ్రీవాత్సవ చెప్పారు. దేశీయంగా విద్యుత్‌ వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని టాటా మోటార్స్‌ పేర్కొంది.

ఈవీ మార్కెట్​ పెరుగుతోంది!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు టాటా మోటార్స్​ దేశవ్యాప్తంగా తమ ఈవీ వెహికల్స్​ మార్కెట్​ను విస్తరించుకోవాలని ప్లాన్ చేసుకుంది.
2023లో ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్​లో 8 శాతం వృద్ధితో పోలిస్తే, ఈవీ సెగ్మెంట్ 90 శాతానికిపైగా వృద్ధి చెందింది. 2024లో కూడా ఇదే విధమైన గ్రోత్ ఉంటుందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ భావిస్తోంది. ఇండియన్​ ఈవీ మార్కెట్లో 70 శాతం వాటాతో టాటా మోటార్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

పర్సనల్ లోన్ కావాలా? ముందుగా ఈ 5 ప్రశ్నలు వేసుకోండి!

రూ.1 లక్ష బడ్జెట్లో మంచి స్కూటీ కొనాలా? అయితే ఈ టాప్​-10 మోడల్స్​పై ఓ లుక్కేయండి!

Last Updated : Feb 13, 2024, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details