తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 4:08 PM IST

ETV Bharat / business

చైల్డ్& అడల్ట్ సేఫ్టీలో 'టాటా' అదుర్స్- 5 స్టార్ రేటింగ్ పొందిన కార్లు ఏవంటే? - 5 Star Rating Tata Cars

TATA Cars 5 Star Rating : టాటా కంపెనీకి చెందిన నాలుగు మోడళ్ల కార్లు ఇటీవల భారత్ NCAP క్రాష్ టెస్ట్​​లో చైల్డ్, అడల్ట్ సెఫ్టీ విభాగంలో 5 స్టార్‌ రేటింగ్​ను పొందాయి. ఆ మోడల్ కార్లు ఏవి? వాటిలో ఉన్న భద్రతా ఫీచర్లు ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.

5 Star Rating Tata Cars
5 Star Rating Tata Cars (Getty Images)

TATA Cars 5 Star Rating : భారత్ NCAP క్రాష్ టెస్ట్​లో పలు మోడళ్ల టాటా కార్లు చైల్డ్, అడల్ట్ సేఫ్టీ ప్రొటెక్షన్‌ విభాగంలో 5 స్టార్‌ రేటింగ్​ను సాధించాయి. మరి ఆ కార్లకు అంత రేటింగ్ రావడానికి గల కారణాలేమిటి? భద్రతా ప్రమాణాల్లో సంస్థ రూపొందించిన ఫీచర్లు ఏంటి? అనేవి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

టాటా సఫారీ, టాటా హారియర్
భారత్‌ న్యూ కార్‌ అసెస్‌ మెంట్‌ ప్రోగ్రామ్‌ (భారత్‌-NCAP) కింద పెద్దవాళ్లు, పిల్లల భద్రతకు సంబంధించి 5 స్టార్‌ రేటింగ్​ను టాటా సఫారీ, టాటా హారియర్‌ పొందాయి. పిల్లల భద్రతలో 49 పాయింట్లకు గాను 44.54 సాధించాయి. పెద్దల భద్రతలో 32కి 30.08 దక్కించుకున్నాయి. కాగా, టాటా హారియర్ ధర రూ. 15.49 లక్షల నుంచి రూ.26.44 లక్షల వరకు ఉంటుంది. టాటా సఫారీ ధర రూ. 16.19 లక్షల నుంచి రూ. 27.34 లక్షల వరకు ఉంటుంది.

టాటా సఫారీ, టాటా హారియర్ కార్లు భారత్ NCAP జరిపిన టెస్టుల్లో పెద్దవాళ్ల శరీర భాగాలకు మంచి రక్షణను అందించాయి. డ్రైవర్, ప్రయాణికుడి ఛాతీకి తగినంత రక్షణను అందించాయి. 18 నెలల చిన్నారుల సెఫ్టీ విభాగంలో హారియర్, సఫారీ కార్లు 12కి 11.54 పాయింట్లు సాధించాయి. 3ఏళ్ల చిన్నారుల భద్రతా ప్రమాణాల్లో 12కి 12 పాయింట్లు పొందాయి. ఈ మోడల్ కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్​లు, కారు వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. ఈ రెండు కార్లు 2 లీటర్ డీజిల్ ఇంజిన్​ను కలిగి ఉంటాయి.

టాటా నెక్సన్ ఈవీ
భారత్‌ న్యూ కార్‌ అసెస్​మెంట్‌ ప్రోగ్రామ్‌ (భారత్‌-NCAP) కింద పెద్దవాళ్లు, పిల్లల భద్రతకు సంబంధించి 5 స్టార్‌ రేటింగ్​ను పొందింది టాటా నెక్సాన్ ఈవీ. పిల్లల భద్రతలో 49 పాయింట్లకు గానూ 44.95 సాధించింది. పెద్దల భద్రతలో 32కి 29.86 దక్కించుకుంది. కాగా, టాటా నెక్సాన్ ఈవీ ధర రూ.14.49 లక్షల నుంచి రూ.19.49 లక్షల వరకు ఉంటుంది.

ఈ కారు కూడా భారత్ NCAP టెస్టుల్లో మంచి రేటింగ్​ను సాధించింది. డ్రైవర్ ఛాతీ, కాళ్లు, ప్రయాణికులకు మంచి రక్షణ కల్పిస్తుంది. 18 నెలల చిన్నారుల సెఫ్టీ విభాగంలో టాటా నెక్సాన్ ఈవీ 12కి 11.94 పాయింట్లు సాధించింది. 3 ఏళ్ల చిన్నారుల భద్రతా ప్రమాణాల్లో 12కి 12 పాయింట్లు పొందింది. ఆ కారులో 6 ఎయిర్‌ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ యాంకర్లు, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. టాటా నెక్సాన్ ఈవీ లాంగ్ రేంజ్(LR) వేరియంట్‌ లో 40.5 kWh బ్యాటరీ ప్యాక్​ను కలిగి ఉంది. ఇది 465 కి.మీ రేంజ్‌ ను ఇస్తుంది. మిడ్‌ రేంజ్‌ వేరియంట్ 30 kWh బ్యాటరీ ప్యాక్​ను కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్‌ పై 325 కి.మీ ప్రయాణించవచ్చు.

టాటా పంచ్ ఈవీ
భారత్‌ న్యూ కార్‌ అసెస్​మెంట్‌ ప్రోగ్రామ్‌ (భారత్‌-NCAP) రేటింగ్​లో టాటా పంచ్‌ ఈవీ 5 స్టార్‌ రేటింగ్‌ దక్కించుకుంది. టాటా మోటార్స్​కు చెందిన కార్లలో టాటా సఫారీ, టాటా హారియర్‌, టాటా పంచ్‌ ఈవీ తర్వాత NCAP టెస్ట్​లో 5 స్టార్ రేటింగ్ దక్కించుకున్న నాలుగో వాహనం ఇదే. పిల్లల భద్రతలో 49 పాయింట్లకు గానూ 45 సాధించింది. పెద్దల భద్రతలో 32కి 31.46 దక్కించుకుంది. కాగా, టాటా పంచ్ ఈవీ ధర రూ.10.99 లక్షల నుంచి రూ.15.49 లక్షల వరకు ఉంటుంది.

పెద్దవాళ్ల భద్రత విషయంలో టాటా పంచ్ ఈవీ అన్ని శరీర భాగాలకు మంచి రక్షణను అందించింది. డ్రైవర్, ప్రయాణికుల ఛాతీ, పాదాలకు రక్షణగా నిలిచింది. టాటా పంచ్ ఈవీ ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాటా పంచ్ ఈవీ లాంగ్ రేంజ్(LR) వేరియంట్‌ లో 35 kWh బ్యాటరీ ప్యాక్​ను కలిగి ఉంది. ఇది 421 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. మిడ్‌ రేంజ్‌ వేరియంట్ 25 kWh బ్యాటరీ ప్యాక్​ను కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్​పై 315 కి.మీ ప్రయాణించవచ్చు.

మీ కార్​ విండ్​షీల్డ్ లోపలి భాగాన్ని క్లీన్ చేయాలా?​​ ఈ టిప్స్​ ఫాలో అవ్వండి! - How To Clean Car Windshield Inside

రూ.5 లక్షల్లో మంచి కారు కొనాలా? టాప్-6 మోడల్స్ ఇవే! - Best Cars Under 5 Lakh

ABOUT THE AUTHOR

...view details