తెలంగాణ

telangana

ETV Bharat / business

బౌన్స్ బ్యాక్​ - సెన్సెక్స్ 1960 పాయింట్స్​ అప్​​ - రాణించిన బ్యాంకింగ్​, ఐటీ స్టాక్స్​ - STOCK MARKET TODAY

దలాల్ స్ట్రీట్​లో లాభాల వర్షం - 23,900 ఎగువన ముగిసిన నిఫ్టీ​ - అదానీ షేర్స్ బౌన్స్ బ్యాక్

Stock Market
Bull Market (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2024, 3:40 PM IST

Updated : Nov 22, 2024, 4:35 PM IST

Stock Market Today November 22, 2024 :వరుస నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం తేరుకుని, భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ రాణించడమే ఇందుకు కారణం. ఒకానొక దశలో సెన్సెక్స్​ 2000 పాయింట్లు మేర పెరిగింది.

చివరకు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 1961 పాయింట్లు లాభపడి 79,117 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్​ సూచీ నిఫ్టీ 557 పాయింట్లు వృద్ధి చెంది 23,907 వద్ద ముగిసింది.

  • లాభపడిన షేర్లు :ఎస్​బీఐ, టీసీఎస్​, ఇన్ఫోసిస్​, టైటాన్​, ఐటీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్​, ఎల్​ అండ్ టీ, పవర్​గ్రిడ్​, హెచ్​సీఎల్ టెక్​, రిలయన్స్​, బజాజ్​ ఫైనాన్స్​, భారతీ ఎయిర్​టెల్​, ఎన్​టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్​, అదానీ పోర్ట్స్​
  • నష్టపోయిన షేర్లు : హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​

కోలుకున్న అదానీ షేర్స్​ :తమ వ్యాపారాభివృద్ధి కోసం, లాభాల కోసం గౌతమ్ అదానీ అధికారులకు లంచం ఇచ్చారనే అభియోగంతో అమెరికాలో ఓ కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనితో గత సెషన్స్​లో భారీగా నష్టపోయిన అదానీ షేర్లు, శుక్రవారం కోలుకుని లాభాల్లోకి దూసుకువచ్చాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీలో అదానీకి చెందిన అంబుజా సిమెంట్​ 3.50 శాతం, ఏసీసీ 3.17 శాతం, అదానీ ఎంటర్​ప్రైజెస్​ 2.16 శాతం, అదానీ పోర్ట్స్​ 2.05 శాతం, అదానీ టోటల్ గ్యాస్​ 1.18 శాతం, ఎన్​డీటీవీ 0.65 శాతం మేర పెరిగాయి.

కలిసొచ్చిన అంశాలు ఇవే!

  • దేశీయ స్టాక్​ మార్కెట్లు వరుస నష్టాలను చవిచూసినందున బ్లూచిప్​ స్టాక్స్​ భారీగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే ఫండమెంటల్​గా స్ట్రాంగ్​ ఉన్న బ్లూచిప్​ స్టాక్స్​ను కొనుగోలు చేసేందుకు మదుపరులు ఆసక్తి చూపించారు. ఫలితంగా ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్​ షేర్లు బాగా రాణించాయి.
  • శుక్రవారం ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం, గురువారం యూఎస్ మార్కెట్లు మంచి లాభాలతో ముగియడం కూడా ఇండియన్ మార్కెట్లకు కలిసొచ్చింది.
  • అమెరికాలో విడుదలైన నిరుద్యోగ డేటా ప్రకారం, నవంబర్​ నెలలో ఉద్యోగాల్లో వృద్ధి కనిపించింది. ఇది ప్రధానంగా ఐటీ స్టాక్స్​కు కలిసివచ్చింది.

విదేశీ పెట్టుబడులు :స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, గురువారం విదేశీ సంస్థాగత మదుపరులు రూ.5,320.68 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు. మరోవైపు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.4,200.16 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.

ముడిచమురు ధరలు :అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.19 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 74.37 డాలర్లుగా ఉంది.

Last Updated : Nov 22, 2024, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details