Stock Market Close :సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడేలో రికార్డ్ పీక్స్‌ను టచ్ చేసిన సూచీలు, తరువాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 19 పాయింట్లు నష్టపోయి 75,390 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 22,932 వద్ద ముగిసింది.
01.00 PM :సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ మొదటిసారిగా 76,000 మార్క్‌ను దాటింది.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 477 పాయింట్లు లాభపడి 75,881 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 120 పాయింట్లు వృద్ధిచెంది 23,077 వద్ద కొనసాగుతోంది.
12.00 PM :ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 415 పాయింట్లు లాభపడి 75,825 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 101 పాయింట్లు వృద్ధిచెంది 23,058 వద్ద కొనసాగుతోంది.
11.00 AM :ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 169 పాయింట్లు లాభపడి 75,579 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 32 పాయింట్లు వృద్ధిచెంది 22,989 వద్ద కొనసాగుతోంది.
Stock Market Today May 27, 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ఎర్లీ ట్రేడ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్-టైమ్ హైరికార్డ్ను క్రాస్ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం, లోక్ సభ ఎన్నికల ఫలితాలపై మదుపరులు ఆశావహ దృక్పథంతో ఉండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 168 పాయింట్లు లాభపడి 75,561 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 40 పాయింట్లు వృద్ధిచెంది 22,997 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ :విప్రో, మారుతి సుజుకి, రిలయన్స్, ఏసియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్, టైటాన్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్
విదేశీ పెట్టుబడులు
FIIs Investments :స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.944.83 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు.
ఆసియా మార్కెట్లు
Asian Markets : ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు అన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. శుక్రవారం యూఎస్ మార్కెట్లు లాభాల్లో ముగిసిన విషయం తెలిసిందే.
రూపాయి విలువ
Rupee Open May 27, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 4 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.06గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices May 27, 2024 :తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices May 27, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.21 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 82.29 డాలర్లుగా ఉంది.
మీరు బైక్ లవర్సా? ఈ పిచ్చెక్కించే 'కాన్సెప్ట్ బైక్స్'ను ఎప్పుడైనా చూశారా? - Crazy Concept Bike
పెట్రోల్ బంకు వాళ్లు చీట్ చేస్తున్నారా? సింపుల్‌గా కనిపెట్టి - ఫిర్యాదు చేయండిలా! - Petrol Pump Scams