Stock Market Close Today November 6, 2024 :బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం ఖరారైన నేపథ్యంలో యూస్ మార్కెట్లతో పాటు, మన దేశీయ స్టాక్ మార్కెట్లకు కూడా మంచి ఊపువచ్చింది. ముఖ్యంగా ఐటీ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. ఎందుకంటే ఐటీ కంపెనీలకు ఎక్కువగా అమెరికా కరెన్సీలోనే ఆదాయం వస్తుంటుంది.
చివరకు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 901 పాయింట్లు లాభపడి 80,378 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 270 పాయింట్లు వృద్ధిచెంది 24,484 వద్ద ముగిసింది.
- లాభపడిన షేర్లు :టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టీ, మారుతి సుజుకి, రిలయన్స్, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఎస్బీఐ, పవర్‌గ్రిడ్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎసియన్ పెయింట్స్
- నష్టపోయిన షేర్లు : టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందూస్థాన్ యూనిలివర్
భారీగా నష్టపోయిన టైటాన్
ప్రముఖ జ్యువెలరీ రిటైలర్, వాచ్ తయారీ సంస్థ అయిన టైటాన్ షేర్లు ఇవాళ 4 శాతం వరకు నష్టపోయాయి. 2024 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో టైటాన్ కంపెనీ నికర లాభం 23 శాతం మేర క్షీణించి రూ.704 కోట్లకు చేరుకుందని తన రిపోర్ట్‌లో పేర్కొనడమే ఇందుకు కారణం.