Stock Market Close Today 10th 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. ప్రధానంగా ఎఫ్ఎంసీజీ, మెటల్, ఎనర్జీ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలు సహా, దేశీయ ఆర్థిక వ్యవస్థపై మదుపరుల విశ్వాసం పెరుగుతుండడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 354 పాయింట్లు లాభపడి మొదటిసారిగా 75,000 మార్క్ ఎగువన ముగిసింది; జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 111 పాయింట్లు వృద్ధి చెంది 22,753 వద్ద జీవన కాల గరిష్ఠాల వద్ద స్థిరపడింది.
- లాభపడిన స్టాక్స్ :ఐటీసీ, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఏసియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, రిలయన్స్, టీసీఎస్
- నష్టపోయిన షేర్స్ :మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సెర్వ్
విదేశీ పెట్టుబడులు
FIIs Investments :స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, మంగళవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.593.20 కోట్ల విలువైన ఈక్విటీలు కొనుగోలు చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లు
Global Markets : ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై నష్టాలతో ముగియగా, హాంకాంగ్ మార్కెట్ లాభాలతో స్థిరపడింది. ఎన్నికల సందర్భంగా దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్లు ఇవాళ పనిచేయలేదు. ప్రస్తుతానికి యూరోపియన్ మార్కెట్లు మంచి లాభాలతో దూసుకుపోతున్నాయి. మంగళవారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.