తెలంగాణ

telangana

ETV Bharat / business

నాలుగు నెలలకే రూ.827 కోట్లు శాలరీ- యాపిల్, గూగుల్ కాదు కాఫీ బ్రాండ్ సీఈఓ ఆదాయం ఇది! - STARBUCKS CEO SALARY 2024

నాలుగు నెలలకు రూ.827 కోట్ల వేతనం తీసుకున్న స్టార్‌బక్స్‌ సీఈఓ- టిమ్‌కుక్‌, సుందర్‌ పిచాయ్‌ కంటే నికోల్​ అధికం

Starbucks CEO Brian Niccol
Starbucks CEO Brian Niccol (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2025, 12:25 PM IST

Starbucks CEO Salary 2024 :యాపిల్‌ సీఈఓ టిక్‌ కుక్‌, గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ కంటే అధిక వేతనాన్ని అందుకున్నారు ప్రముఖ కాఫీ బ్రాండ్‌ స్టార్‌బక్స్‌ సీఈఓ బ్రియాన్‌ నికోల్‌. బ్రియాన్ మొదటి నాలుగు నెలల వేతనం ఏకంగా 96 మిలియన్‌ డాలర్లు ( సుమారు రూ.827 కోట్లు) అందుకున్నట్లు ఓ అంతర్జాతీయ వార్త సంస్థ పేర్కొంది. అమెరికాలో కార్పొరేట్‌ అతిపెద్ద ప్యాకేజీల్లో ఇదీ ఒకటి ఉందని తెలిపింది. అదే సుందర్ పిచాయ్, టిక్​ కుక్​ నాలుగు నెలలకు ఒక్కొక్కరు 75 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.646 కోట్లు) వెల్లడించింది.

అంతర్జాతీయ వార్త సంస్థ కథనం ప్రకారం, గతేడాది సెప్టెంబర్‌ ప్రారంభంలో స్టార్‌బక్స్‌లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు బ్రియాన్‌ నికోల్‌. కంపెనీలో చేరిన నెల తర్వాత 5 మిలియన్‌ డాలర్లు సైన్‌-ఆన్‌ బోనస్‌ను కూడా పొందారు. నికోల్ జీతంలో దాదాపు 94 శాతం స్టాక్‌ అవార్డుల రూపంలో అందుకున్నారు. దీంతో అమెరికాలోని అధిక వేతనాలు అందుకొనే సీఈఓల్లో టాప్‌ 20లో నికోల్‌ నిలిచారు. అయితే నికోల్‌ని నియమించుకునే సమయంలో వార్షిక వేతన ప్యాకేజీ 113 మిలియన్‌ డాలర్లు ఉంటుందని వార్త సంస్థ అంచనా వేసింది. అయితే కేవలం నాలుగు నెలలకే నికోల్‌ 96 మిలియన్‌ డాలర్లు అందుకోవడం గమనార్హం.

స్టార్‌బక్స్‌లో అమ్మకాలు క్షీణించిన సమయంలో కంపెనీ సీఈఓగా ఉన్న భారత సంతతికి చెందిన లక్ష్మణ్‌ నరసింహన్​ను తొలగించింది. ఆ తర్వాత నికోల్‌ స్టార్‌బక్స్‌ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం నికోల్​ ఉన్న ప్రాంతంలోనే తాత్కాలిక గృహ ఖర్చులను భరించేందుకు, అలాగే కంపెనీ జెట్‌ను ఉపయోగించేందుకు అంగీకరించింది.

కథనం ప్రకారం నికోల్‌ గృహ వినియోగ అవసరాల కంటే 1,43,000 డాలర్లు అధికంగా కంపెనీ ఆయనకు చెల్లించింది. దక్షిణ కాలిఫోర్నియాలోని తన ఇంటి నుంచి సీటెల్‌లోని స్టార్‌బక్స్‌ ప్రధాన కార్యాలయానికి ప్రయాణించడం కోసం మరో 72 వేల డాలర్లు, ఇతర వ్యక్తిగత ఖర్చుల కోసం సుమారు 19 వేల డాలర్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details