తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ రిటర్నుల ఫైలింగ్‌లో తప్పులు చేశారా? అయితే సరిదిద్దుకోండిలా! చివరి తేది ఇదే! - Revised ITR Filing - REVISED ITR FILING

How Many Time Filing Revised ITR : ఐటీ రిటర్నులు ఫైల్ చేసిన తర్వాత ఒక్కోసారి వాటిలో తప్పు జరిగినట్లు గమనిస్తుంటాం. అయితే అటువంటి సమయంలో తప్పులను రివైజ్డ్ చేసే అవకాశం ఉంటుందా? ఎన్నిసార్లు రిటర్నులు ఫైల్ చేయొచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

How Many Time Filing Revised ITR
How Many Time Filing Revised ITR (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 6, 2024, 10:06 AM IST

How Many Time Filing Revised ITR: ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వారందరూ తమ ఆదాయం, పన్నులకు సంబంధించిన వివరాలతో ఐటీ రిటర్నులు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల దాఖలు చేసే గడువు దగ్గర పడుతోంది. చాలా మంది ఇప్పటికే తమ రిటర్నులు దాఖలు చేశారు కూడా. అయితే, ఏవైనా తప్పులు దొర్లినప్పుడు వాటిని సవరించుకునేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం అవకాశం కల్పిస్తోంది. దానినే రివైజ్డ్ ఐటీఆర్ అంటారు. అంటే ప్రాథమిక ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల్లో ఏమైనా తప్పులు ఉంటే సరిచేయడం, పాత సమాచారాన్ని తొలగించడం వంటివి చేయొచ్చు.

ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం 1961లోని సెక్షన్ 139(5) అనేది రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. తప్పులను సరిచేసుకుని కచ్చితమైన ట్యాక్స్ ఫైలింగ్ చేసేందుకు అవకాశం ఇస్తుంది. అయితే, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువు 2024 జులై 31తో ముగిస్తుంది. ఆలోపే ఏదైనా చేయాల్సి ఉంటుంది. లేదంటే తర్వాత పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది.

ఎన్నిసార్లు రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు?
కొన్నిసార్లు తప్పుడు ఐటీఆర్ ఫామ్ ఫైల్ చేయడం, తప్పులు దొర్లలడం, సరైన సమాచారం లేకపోవడం వంటి కారణాలతో ఐటీఆర్ కరెక్షన్ చేయాల్సి వస్తుంది. అయితే, ఎన్నిసార్లు తప్పులు సరిచేసుకుని రివైజ్డ్ చేసేందుకు అవకాశం ఉంది? అనే ప్రశ్న చాలా మంది పన్ను చెల్లింపుదారుల్లో ఉండే ఉంటుంది. అయితే, ఐటీ నిబంధనల ప్రకారం గడువు ముగిసే వరకు ఎన్నిసార్లైనా మీ ఐటీఆర్‌లో తప్పులు సరి చేసుకోవచ్చు. సెక్షన్ 139(5) ప్రకారం రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేసే గడువు డిసెంబర్ 31 వరకు ఉంది. అయితే, పాత అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించినవి అయితే మాత్రం ఐటీ విభాగం సూచించిన గడువు లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.

సవరించిన ఐటీఆర్‌ను ఫైల్ చేయడం వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయి. పన్ను రీఫండ్లను స్వీకరించవచ్చు. పన్ను అధికారులు మీ రిటర్నులను సమీక్షించేందుకు ఎంపిక చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా సవరించిన ఐటీఆర్ ఫైల్ చేయడం ద్వారా జరిమానా పడకుండా చూసుకోవచ్చు. అసలు ఫైల్ అప్​డేట్ చేసిన రిటర్నుతో భర్తీ అవుతుంది. ఇది ఆదాయపు పన్ను శాఖ సమీక్షకు వెళ్తుంది. మీ పన్ను రిటర్నులు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రాసెసింగ్ పూర్తి చేసేందుకు దోహదపడుతుంది.

మారుతి స్విఫ్ట్​లో ఈ వేరియంట్​కే ఫుల్ డిమాండ్ - మీ ఛాయిస్ ఏంటి? - Maruti Swift Bookings

మీ బైక్​ మైలేజ్ తగ్గుతోందా? ఈ టిప్స్ పాటిస్తే ఓ రేంజ్​లో పెరగడం గ్యారెంటీ! - Bike Mileage Increase Tips

ABOUT THE AUTHOR

...view details