తెలంగాణ

telangana

ETV Bharat / business

పేటీఎం యూజర్లకు ఊరట- అప్పటి వరకు కార్డులు, ఫాస్టాగ్​లు పనిచేస్తాయ్​

RBI On Paytm Payments Bank : పేటీఎం యూజర్లకు ఊరట లభించింది. మరో 15 రోజుల గడువునిస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్​బీఐ. మరోవైపు ఫాస్టాగ్‌ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎంను తొలగించింది.

RBI On Paytm Payments Bank
RBI On Paytm Payments Bank

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 7:26 PM IST

Updated : Feb 16, 2024, 9:20 PM IST

RBI On Paytm Payments Ban : పేటీఎంకు చెందిన పేమెంట్స్ బ్యాంక్​కు ఆర్​బీఐ మరో 15 రోజుల గడువునిస్తూ నిర్ణయం తీసుకుంది. జనవరి 31న పేటిఎంపై ఆంక్షలు విధిస్తూ రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తాజాగా పేటిఎంకు ఇచ్చిన గడువును మార్చి 15 వరకు పొడిగించింది ఆర్​బీఐ. దీంతో కార్డులతో పాటు ఫాస్టాగ్​లు పనిచేస్తాయి. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్ ఖాతాదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డబ్బును విత్​డ్రా చేసుకునేందుకు వీలుగానే ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా ఆర్​బీఐ తెలిపింది.

పేటీఎం వ్యాలెట్‌, పేమెంట్స్‌ బ్యాంక్​ ద్వారా కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బయటి ఆడిటర్లు పూర్తిస్థాయిలో ఆడిట్‌ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగానే రిజర్వ్​ బ్యాంక్​ ఈ నిర్ణయం తీసుకుంది. పేటీఎం సంస్థ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని ఆడిట్‌లో తేలినందవల్లే ఆ సంస్థపై మరింతగా పర్యవేక్షణ చర్యలు చేపట్టాల్సి వస్తోందని ఆర్‌బీఐ అప్పట్లో వెల్లడించింది.

నోడల్​ ఖాతాను యాక్సిస్​ బ్యాంక్​కు బదిలీ చేసిన పేటీఎం
మరోవైపు లావాదేవీలను కొనసాగించడానికి పేటీఎం తన నోడల్​ అకౌంట్​ను యాక్సిస్​ బ్యాంక్​కు మార్చింది. క్యూ ఆర్​ పేమెంట్లకు, సౌండ్​ బాక్స్​, కార్డ్​ మిషన్​ సేవలు మార్చి​ 15 తర్వాత కూడా కొనసాగేందుకు పేటీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్ వినియోగదారుల, వ్యాపారులు తమ ఖాతాలను మార్చి 15 లోపు ఇతర బ్యాంకులకు మార్చుకోవాలని ఆర్​బీఐ సూచించింది. పేటీఎం తన నోడల్ ఖాతాను యాక్సిస్ బ్యాంక్​కు మార్చింది. ఇలా చేయడం ద్వారా మర్చంట్ లావాదేవీలు సజావుగా సాగేందుకు అవకాశం ఏర్పడుతుంది' అని పేటీఎం తెలిపింది. పేటీఎం నోడల్​ అకౌంట్​ అనేది తన ఖాతాదారుల వ్యాపార లావాదేవీలు పరిష్కరించే ఒక మాస్టర్​ ఖాతాలంటిది.

ఫాస్టాగ్​ నుంచి తొలగింపు
పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తరఫున టోల్‌ రుసుము వసూలు చేసే NHAI, ఫాస్టాగ్‌ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి తొలగించింది. ఏ ఇబ్బంది లేని ప్రయాణం కోసం తాము పేర్కొన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్‌లు కొనుగోలు చేయాలని యూజర్లకు సూచించింది. IHMCL పేర్కొన్న జాబితాలో SBI, HDFC బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ICICI బ్యాంక్‌, IDBI బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌ సహా మొత్తం 32 బ్యాంకులు ఉన్నాయి. వీటిలో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ను మినహాయించారు. ఫిబ్రవరి 29 తర్వాత వినియోగదారుల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్‌-అప్‌లు స్వీకరించొద్దని PPBLను ఆర్‌బీఐ ఇటీవల ఆదేశించింది. ఆయా ఖాతాల్లో ఇప్పటి వరకు ఉన్న నగదును మాత్రం అయిపోయేంత వరకు వాడుకోవచ్చని స్పష్టం చేసింది. ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలోనే IHMCL తాజా మార్పులు చేసినట్లు తెలుస్తోంది

Paytm ఆడిటింగ్​లో నమ్మలేని నిజాలు! మనీలాండరింగ్‌కు అవకాశం!

పేటీఎం 3 రోజుల నష్టాలకు బ్రేక్​ - లాభాల్లోకి కంపెనీ షేర్స్​ - కారణం ఏమిటంటే?

Last Updated : Feb 16, 2024, 9:20 PM IST

ABOUT THE AUTHOR

...view details