Popular Bikes In India 2024 :ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లోనూ బైక్ ఉంటోంది. చిన్న చిన్న అవసరాల కోసం కూడా బైక్ ను వాడుతున్నారు. మరి మీరు కూడా మంచి బైక్ ను కొనాలనుకుంటున్నారా? అయితే స్టెలిష్ లుక్, బెస్ట్ పెర్ఫార్మెన్స్, మంచి మైలేజ్ ఇచ్చే బైక్ లు మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిలోని టాప్-10 బైక్స్ ఇవే.
1. Yamaha MT 15 V2 Features : యమహా ఎమ్టీ 15 వీ2 బైక్ భారత మార్కెట్లో 8 వేరియంట్లు, 3 రంగుల్లో అందుబాటులో ఉంది. ధర ఎక్కువైనా మంచి లుక్తో ఉన్న బైక్ కొనాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ కావచ్చు.
ఇంజిన్ కెపాసిటీ - 155 సీసీ
మ్యాక్స్ పవర్ - 18.4 PS @ 10000 rpm
మ్యాక్స్ టార్క్ - 14.1 Nm @ 7500 rpm
ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 10 లీటర్లు
మైలేజ్ - 56.87 kmpl
కెర్బ్ వెయిట్ - 139 కేజీలు
బ్రేక్స్- డబుల్ డిస్క్
ధర - రూ.1.68 - రూ.1.74 లక్షల వరకు ఉంటుంది.
2. Bajaj Pulsar NS400Z Features : బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400 జడ్ బైక్ భారత మార్కెట్లో ఒక వేరియంట్, నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ బైక్ మంచి ఇంజిన్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. రూ.1.50 లక్షల ధర బడ్జెట్ పెట్టగలిగి, మంచి స్టైలిష్ బైక్ను కొనాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ కావచ్చు.
ఇంజిన్ కెపాసిటీ - 373.27 సీసీ
మ్యాక్స్ పవర్ - 40 PS @ 8800 rpm
మ్యాక్స్ టార్క్ - 35 Nm @ 6500 rpm
ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 12 లీటర్లు
కెర్బ్ వెయిట్ - 174 కేజీలు
బ్రేక్స్- డబుల్ డిస్క్
ధర- రూ.1,85,000
3. Hero Splendor Plus Features : హీరో స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్ భారత మార్కెట్లో 3 వేరియంట్లు, 7 రంగుల్లో అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్, మంచి మైలేజ్ ఇచ్చే బైక్ తీసుకోవాలనుకునేవారికి మంచి ఆప్షన్ గా ఉంటుంది.
ఇంజిన్ కెపాసిటీ - 97.2 సీసీ
మ్యాక్స్ పవర్ - 8.02 PS @ 8000 rpm
మ్యాక్స్ టార్క్ - 8.05 Nm @ 6000 rpm
ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 9.8 లీటర్లు
మైలేజ్- 80.6 kmpl
కెర్బ్ వెయిట్ - 112 కేజీలు
బ్రేక్స్- డ్రమ్
ధర- రూ.75,441- రూ.76,786 వరకు ఉంటుంది.
4. Royal Enfield Classic 350 Features : రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ భారత మార్కెట్లో 6 వేరియంట్లు, 12 రంగుల్లో అందుబాటులో ఉంది. స్టైలిష్ లుక్, రాయాలిటీ లుక్ కావాలనుకునేవారు ఈ బైక్ ను ఆప్షన్ గా ఎంచుకోవచ్చు.
ఇంజిన్ కెపాసిటీ - 349.34 సీసీ
మ్యాక్స్ పవర్ - 20.21 PS @ 6100 rpm
మ్యాక్స్ టార్క్ - 27 Nm @ 4000 rpm
ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 13 లీటర్లు
మైలేజ్- 41.55 kmpl
కెర్బ్ వెయిట్ - 195 కేజీలు
బ్రేక్స్- డబుల్ డిస్క్
ధర- రూ.1.93 - 2.25 లక్షల వరకు ఉంటుంది.
5. TVS Apache RTR 160 Features : టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 మోడల్ బైక్ 3 వేరియంట్లు, 5 రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ బైక్ మంచి ఇంజిన్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఇంజిన్ కెపాసిటీ - 159.7 సీసీ
మ్యాక్స్ పవర్ - 16.04 PS @ 8750 rpm
మ్యాక్స్ టార్క్ - 13.85 Nm @ 7000 rpm
ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 12 లీటర్లు
మైలేజ్- 47 kmpl
కెర్బ్ వెయిట్ - 138 కేజీలు
బ్రేక్స్- డబుల్ డిస్క్
ధర- రూ.1.20 - 1.27 లక్షల వరకు ఉంటుంది.