Paytm Offer For Ayodhya Trip :ప్రముఖ పేమెంట్ ప్లాట్‌ఫాం పేటీఎం అయోధ్య యాత్రికుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పేటీఎం ద్వారా బస్సు, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తే గరిష్ఠంగా 100 శాతం వరకు క్యాష్ బ్యాక్ అందిస్తామని స్పష్టం చేసింది. తక్కువ బడ్జెట్లో అయోధ్యకు వెళ్లిరావాలని ఆశించేవారికి ఇది బాగా ఉపయోగపడుతుందని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యునికేషన్ లిమిటెడ్ పేర్కొంది.
ప్రోమో కోడ్ ఇదే!
అయోధ్యలో కొలువైన బాలరాముడిని దర్శించుకోవాలని ఆశించే భక్తులు పేటీఎం ద్వారా సులువుగా బస్సు, విమాన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే బస్సు టికెట్లు బుక్ చేసేవారు BUSAYODHYA అనే ప్రోమోకోడ్ ఉపయోగించాలి. విమానం టికెట్లు బుక్ చేసుకునేవారు FLYAYODHYA అనే ప్రోమోకోడ్ ఎంటర్ చేయాలి. బస్సు టికెట్స్ బుక్ చేసుకునేవారికి గరిష్టంగా రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునేవారికి గరిష్ఠంగా రూ.5000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
ఫ్రీ క్యాన్సిలేషన్
అయోధ్యకు వెళ్లే యాత్రికులు పేటీఎం ద్వారా బుక్ చేసుకున్న టికెట్లను ఉచితంగా క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. దీనితో వారికి ఎలాంటి కోతలు లేకుండా 100 శాతం రిఫండ్ లభిస్తుందని పేటీఎం స్పష్టం చేసింది. అంతేకాదు వన్-వే, రౌండ్-ట్రిప్ ఫ్లైట్ బుకింగ్స్ చేసుకునేవారికి మరింత తక్కువ ధరలకే విమానం టికెట్లు అందిస్తున్నట్లు పేర్కొంది.
లైవ్ ట్రాకింగ్
అయోధ్యకు వెళ్లే యాత్రికులకు లైవ్ బస్ ట్రాకింగ్ ఫెసిలిటీ కల్పిస్తారు. దీనివల్ల తాము ఎక్కడ ఉన్నదీ వారి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు సులువుగా తెలియజేయవచ్చు. ఇది ప్రయాణికులకు అదనపు భద్రతను కల్పిస్తుంది.