తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రీ వెడ్డింగ్​లో మెరిసిన నీతా అంబానీ- రూ.500 కోట్ల డైమండ్ నెక్లెస్​తో స్పెషల్ అట్రాక్షన్! - నీతా అంబానీ నెక్లెస్ ధర

Nita Ambani Diamond Necklace Cost : అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు. ఖరీదైన కాంచీపుర చీర, పొడవాటి డైమండ్ నెక్లెస్​తో మెరిశారు. ప్రస్తుతం సోషల్​ మీడియాలో ఆ నెక్లెస్ ధరపై​ పెద్ద చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ నెక్లెస్ ధర ఎంతంటే?

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 4:17 PM IST

Nita Ambani Diamond Necklace Cost : ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్​పర్సన్​ నీతా అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మూడు రోజుల పాటు సాగిన అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో చివరి రోజు నృత్య ప్రదర్శన చేసి అందరిని ఆకట్టుకున్నారు. అంతే కాకుండా తన లుక్స్, ఫ్యాషన్​తో స్పెషల్​గా కనిపించారు. ముఖ్యంగా నీతా అంబానీ ధరించిన డైమండ్​ నెక్లెస్​ స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచింది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ డైమండ్ నెక్లెస్ ధర గురించే చర్చ జరుగుతోంది.

ప్రీ వెడ్డింగ్ కోసం ప్రత్యేకంగా
మూడో రోజు జరిగిన ఈవెంట్​లో నీతా అంబానీ చేనేత కాంచీపురం చీరలో మెడలో పొడవాటి పచ్చరంగు డైమండ్ నెక్లెస్​తో మెరిశారు. బోర్డర్​పై క్లాసిక్ ట్రెడిషనల్ జర్దోసీ వర్క్, బ్లౌజ్ స్లీవ్​లపై ప్రత్యేకమైన గోటా వర్క్, లైట్​గా తన ఐకానిక్ సిగ్నేచర్ మేకప్​తో కనిపించారు. అయితే నీతా అంబానీ ధరించిన ఆ డైమండ్ నెక్లెస్​పై నుంచి అతిథులు కూడా చూపు తిప్పుకోలేకపోయారు. అయితే కొన్ని నివేదికలు ప్రకారం ఈ నెక్లెస్ ధర దాదాపు రూ.400-500 కోట్లు ఉంటుందని అంచనా. ఈ మణిహారాన్ని ప్రీ వెడ్డింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించినట్లు తెలుస్తోంది.

నీతా అంబానీ నృత్య ప్రదర్శన
మరోవైపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన కాక్​టెయిల్ నైట్​ ఈవెంట్​లో వైన్​ కలర్ కస్టమ్-మేడ్ గౌను, క్లాసిక్ ఫ్రెంచ్ ట్విస్ట్ బన్​లో అదిపోయే లుక్​లో కనిపించారు నీతా అంబానీ. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఆదివారం సాయంత్రం 'హస్తాక్షర్'(సంతకం)తో ముగింపు పలికారు. ఈ వేడుకల్లో భాగంగా నీతా అంబానీ 'విశ్వంభరి స్తుతి' పేరిట చేసిన నృత్య ప్రదర్శనతో అతిథులను అలరించారు. కాబోయే భార్యాభర్తలకు అమ్మవారి ఆశీస్సులను కోరుతూ ఆ నాట్యం చేశారు. మనవరాళ్లు ఆదియా శక్తి, వేదకు అంకితం చేశారు. కాగా గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో మూడురోజుల పాటు జరిగిన ప్రీవెడ్డింగ్ వేడుకల్లో వెయ్యిమంది దేశీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు పాల్గొన్నారు. హాలీవుడ్ పాప్‌ గాయని రిహన్నా తదితరులు ప్రదర్శనలు ఇచ్చారు.

అనంత్- రాధిక ప్రీవెడ్డింగ్ సంబరాలు షురూ!- జామ్​నగర్​లో ధోనీ, బాలీవుడ్ స్టార్ కపుల్స్ సందడి

అంబానీల ప్రీవెడ్డింగ్​లో రామ్​చరణ్ స్టెప్పులు- జంగిల్ సఫారీ డ్రెస్సుల్లో ఫోజులిచ్చిన సెలెబ్రిటీస్

ABOUT THE AUTHOR

...view details