Next-Gen Maruti Suzuki Baleno :కార్ల ప్రియులకు గుడ్‌న్యూస్. మారుతి సుజుకి నెక్ట్స్ జనరేషన్ బాలెనో కారును 2026లో మార్కెట్లోకి తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది కాలం క్రితం మారుతి కంపెనీ పరిచయం చేసిన ఈ బాలెనో కారు కస్టమర్లలో మంచి క్రేజీ సంపాదించింది. ప్రస్తుతం ఈ బాలెనో కారు 1.2 L సిరీస్ పెట్రోల్, 1.2L టర్బో బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించి సరికొత్త ఫీచర్స్‌తో మారుతీ నెక్ట్స్‌జెన్ కారును పరిచయం చేయనుంది ఆ సంస్థ. ఆ కంపెనీ కొత్తగా తీసుకువస్తున్న మారుతి బాలెనో ఎంత మైలేజ్ ఇస్తుంది. ఇంజన్ ప్రత్యేకతలు ఏంటి? అనే వివరాలు మీ కోసం.
ఈ 5 సీటర్ కారు దేశంలోనే బెస్ట్ సెల్లర్స్‌లో ఒకటిగా నిలిచింది. మారుతి సుజుకి ఇప్పటికే తన పోర్ట్‌ఫోలియోలో గ్రాండ్ విటారా, ఇన్విక్టో మైల్డ్ హైబ్రిడ్ కార్లను కలిగి ఉంది. ఈ రెండు కార్లు టయోటా కంపెనీకి చెందిన హైబ్రిడ్ టెక్నాలజీ ఆధారంగానే పనిచేస్తాయి. అయితే నెక్ట్స్‌జెన్ బాలెనోలో మారుతి సుజుకి సొంతంగా అభివృద్ధి టెక్నాలజీతో కూడిన హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. హైబ్రిడైజిడ్ మాస్ మార్కెట్ వెహికల్స్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని మారుతి సుజుకి భావిస్తోంది. ఈ హైబ్రిడ్ కార్లను మార్కెట్లో కాంపిటేటివ్ ధరలకే ఇవ్వాలని సన్నాహలు చేస్తోంది. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా ఈ విధానాన్ని వ్యవహరిస్తున్నారు.
సరికొత్త సాంకేతికతతో
నెక్ట్స్‌జన్ మారుతీ సుజుకి బాలెనో పెట్రోల్ మిల్ ఉంటుంది. వెహికల్ రేంజ్‌ను పెంచడంలో పెట్రోల్ మిల్ ముఖ్యపాత పోషిస్తుంది. అయితే డైరెక్ట్‌గా ప్రొపెల్ అవ్వకుండా ఎలక్ట్రిక్ మోటర్తో పవర్‌ను జనరేట్ చేస్తుంది. బ్యాటరీ ప్యాక్ లేదా జనరేటర్ నుంచి ఎలక్ట్రిక్ మోటర్ శక్తిని గ్రహిస్తుంది. తద్వారా ఇంజిన్ జనరేటర్‌గా పనిచేస్తుంది. ఈ కారు 35KMPL మైలేజ్‌ను ఇస్తుందని అంచనాలున్నాయి.