తెలంగాణ

telangana

ETV Bharat / business

మెడిక్లెయిమ్‌ Vs హెల్త్ ఇన్సూరెన్స్ - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్‌? - Mediclaim Vs Health Insurance - MEDICLAIM VS HEALTH INSURANCE

Mediclaim Vs Health Insurance : సాధారణంగా మనం మెడిక్లెయిమ్, హెల్త్ ఇన్సూరెన్స్ అనే పదాలు వింటూ ఉంటాం. ఇవి వినడానికి ఒకేలా ఉన్నప్పటికీ, ఇవి అందించే కవరేజీ చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే వీటి గురించి ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.

Mediclaim vs Health Insurance
Mediclaim vs Health Insurance (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2024, 4:53 PM IST

Mediclaim Vs Health Insurance : నేటి ఆధునిక జీవనశైలి వల్ల కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కనుక ఎప్పుడు ఎలాంటి హెల్త్ ఎమర్జెన్సీ వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అందుకే భవిష్యత్‌లో ఎలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలంటే, మంచి మెడిక్లెయిమ్‌ను లేదా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం ఎంతైనా అవసరం. వాస్తవానికి మెడిక్లెయిమ్, హెల్త్ ఇన్సూరెన్స్ రెండూ వినడానికి ఒకేలా ఉన్నప్పటికీ, అవి అందించే హెల్త్‌ కవరేజీ మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది.

మెడిక్లెయిమ్‌ :మెడిక్లెయిమ్ అనేది కూడా ఒక ఆరోగ్య బీమా పాలసీ లాంటిదే. అనారోగ్యం ఏర్పడినప్పుడు, గాయాలపాలు అయినప్పుడు ఇది సాధారణ వైద్యానికి, చికిత్సలకు అయ్యే ఖర్చులకు కవరేజీ అందిస్తుంది. మీరు కనుక ముందుగా ఫీజులు చెల్లించినట్లైతే, తరువాత ఆ డబ్బులు మీకు రీయింబర్స్‌ చేస్తుంది. ఇందుకోసం పాలసీదారులు వైద్య బిల్లులను సమర్పించాల్సి ఉంటుంది.

మెడిక్లెయిమ్ వల్ల కలిగే బెనిఫిట్స్‌

  • అనారోగ్యంతో లేదా గాయాలతో ఆసుపత్రిలో చేరినప్పుడు అందుకు అయ్యే ఖర్చులను అందిస్తుంది. కనుక మీపై ఆర్థిక భారం పడకుండా ఉంటుంది.
  • మీతోపాటు, మీ జీవిత భాగస్వామికి, పిల్లలకు, కొన్నిసార్లు మీపై ఆధారపడిన తల్లిదండ్రులకు హెల్త్ కవరేజ్ అందిస్తుంది.
  • నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స పొందే వీలుంటుంది. దీని వల్ల ముందస్తు చెల్లింపులు చేయాల్సిన అవసరం రాదు.
  • మెడిక్లెయిమ్ ప్రీమియం చాలా వరకు తక్కువగా ఉంటుంది. పైగా దీనిపై చాలా వరకు పన్ను మినహాయింపులు ఉంటాయి. కనుక తక్కువ డబ్బులతో మంచి ఆరోగ్య సంరక్షణ పొందవచ్చు.

ఆరోగ్య బీమా :మెడిక్లెయిమ్‌తో పోల్చితే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా విస్తారమైన కవరేజీని అందిస్తుంది. వ్యక్తులు, లేదా కుటుంబాలు బీమా కంపెనీకి రెగ్యులర్‌గా ప్రీమియంలు చెల్లించి, హెల్త్ ఇన్సూరెన్స్‌ను పొందుతూ ఉండవచ్చు. మీరు ఎంచుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఆధారంగా ఈ కవరేజ్ ఉంటుంది. డాక్టర్ కన్సల్టేషన్‌కు, హాస్పిటల్‌లో ఉండడానికి, శస్త్రచికిత్సలకు, మందులకు ఇలా పలు వైద్య ఖర్చులకు ఇది కవరేజీ అందిస్తుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్

  • ఆరోగ్య బీమా ప్రధాన వైద్య ఖర్చులు అన్నింటినీ మీకు అందిస్తుంది. ఆసుపత్రిలో చేరినా, డేకేర్‌లో ఉన్నా, ఇంటి వద్దే చికిత్స పొందినా ఇది ఖర్చులను కవర్ చేస్తుంది. అంతేకాదు అంబులెన్స్ రుసుములను కూడా అందిస్తుంది. కనుక మీరు ఆర్థిక చింతలు లేకుండా హాయిగా ఉండవచ్చు.
  • క్రిటికల్ ఇల్‌నెస్‌ ప్లాన్లు, యాడ్‌-ఆన్‌లు కూడా ఇందులో ఉంటాయి. కనుక కిడ్నీ సమస్యలు, అవయవ చికిత్సలు, ఎముక మజ్జ మార్పిడి, స్ట్రోక్స్‌ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.
  • చాలా బీమా సంస్థలు నగదు రహిత క్లెయిమ్‌ సేవలను అందిస్తాయి. కనుక ముందస్తుగా మీరు డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. మెడికల్ ఎమర్జెన్సీ సమయంలోనూ మీపై ఎలాంటి ఆర్థిక ఒత్తిడి ఉండదు.
  • ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80డీ ప్రకారం, హెల్త్ ఇన్సురెన్స్‌ ప్రీమియంలపై పన్ను మినహాయింపులు ఉంటాయి.

మెడిక్లెయిమ్‌ Vs హెల్త్ ఇన్సూరెన్స్‌

1. కవరేజీ

  • మెడిక్లెయిమ్‌ :ఇది నిర్దిష్టమైన ఆరోగ్య సంబంధిత ఖర్చులకు కవరేజ్ అందిస్తుంది. ఆరోగ్య బీమాతో పోల్చితే ఇది అందించే కవరేజీ కాస్త తక్కువగా ఉంటుంది.
  • హెల్త్ ఇన్సూరెన్స్‌ : హాస్పిటలైజేషన్‌, ఔట్ పేషెంట్ కేర్‌, డయాగ్నోస్టిక్స్, మెటర్నిటీ, ప్రివెంటివ్ కేర్‌ సహా వివిధ వైద్య ఖర్చులకు ఇది విస్తృతమైన కవరేజీని అందిస్తుంది.

2. పాలసీ టెర్మ్‌

  • మెడిక్లెయిమ్‌ : ఈ యాన్యువల్ పాలసీని రెగ్యులర్‌గా రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • హెల్త్ ఇన్సూరెన్స్‌ : మీరు కోరుకుంటే వార్షిక ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవచ్చు. లేదా దీర్ఘకాలిక పాలసీని సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు. దీని వల్ల మీకు ఎక్కువ కాలం పాటు కవరేజీ లభిస్తుంది.

3. ప్రీమియం

  • మెడిక్లెయిమ్‌ : దీని ప్రీమియం కాస్త తక్కువగా ఉంటుంది. కవరేజీ కూడా అందుకు తగ్గట్టుగా ఉంటుంది.
  • హెల్త్ ఇన్సూరెన్స్‌ : మెడిక్లెయిమ్‌తో పోల్చితే ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే దీని వల్ల విస్తృతమైన కవరేజీ లభిస్తుంది.

4. క్లెయిమ్ ప్రాసెస్‌

  • మెడిక్లెయిమ్ : సాధారణంగా మెడిక్లెయిమ్‌లో రీయింబర్స్‌మెంట్ ఉంటుంది. అంటే బీమా చేసిన వ్యక్తి ముందుగా మెడికల్ బిల్లులు సమర్పించాలి. దాని ఆధారంగా ఆ డబ్బులను బీమా సంస్థ పాలసీదారునికి అందిస్తుంది.
  • హెల్త్ ఇన్సూరెన్స్‌ :ఆరోగ్య బీమా పాలసీలో నగదు రహిత క్లెయిమ్స్ చేసుకునే వీలుంటుంది. అంటే పాలసీదారు ముందస్తుగా డబ్బు చెల్లించకుండా, చికిత్స పొందవచ్చు. బీమా సంస్థయే నేరుగా ఆ డబ్బులను హాస్పిటల్‌ వారికి చెల్లిస్తుంది.

5. వెయిటింగ్ పీరియడ్‌

  • మెడిక్లెయిమ్ : మెడిక్లెయిమ్‌ తీసుకున్న తరువాత దానికి కొంత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ తరువాత మాత్రమే కవరేజీ లభిస్తుంది.
  • హెల్త్ ఇన్సూరెన్స్‌ : ఆరోగ్య బీమా పాలసీలకు కూడా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దీని తరువాత పూర్తి కవరేజీ లభిస్తుంది.

6. పాలసీ బెనిఫిట్స్‌

  • మెడిక్లెయిమ్ :దీనికి రైడర్స్‌, యాడ్‌-ఆన్స్‌ లాంటివి ఉండవు. కనుక కవరేజీని పెంచుకోవడానికి పెద్దగా వీలుండదు. అయితే ఇవి క్రిటికల్ ఇల్‌నెస్‌ కవరేజీని, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్స్‌ను అందిస్తాయి.
  • హెల్త్ ఇన్సూరెన్స్‌ : మీ ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా రైడర్స్‌ను, యాడ్‌-ఆన్స్‌ను కొనుగోలు చేయవచ్చు. దీని వల్ల మీకు విస్తృతమైన కవరేజీ లభిస్తుంది. వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లు, మెటర్నిటీ కవరేజీ లాంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

ఏది బెస్ట్ ఛాయిస్‌?
మీ ఆర్థిక పరిస్థితులకు, ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా మెడిక్లెయిమ్‌ను లేదా ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవాల్సి ఉంటుంది. కానీ విస్తృతమైన కవరేజీ అందించే హెల్త్ ఇన్సూరెన్స్‌ తీసుకోవడం వల్ల భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది.

హెల్త్ ఇన్సూరెన్స్​ ప్రీమియం భారం తగ్గించుకోవాలా? 'టాపప్'​ చేసే ముందు ఇవి తెలుసుకోవడం మస్ట్! - Health Insurance Top Up Plans

మీ 'హెల్త్ ఇన్సూరెన్స్​ పాలసీ'ని మరో సంస్థకు మార్చాలా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్​! - Health Insurance Portability

ABOUT THE AUTHOR

...view details