Maruti Suzuki New Swift 2024 : మారుతి సుజుకి స్విఫ్ట్ భారత్ మార్కెట్‌లో అత్యధికంగా విక్రయాలు కలిగి ఉన్న కార్లలో ఒకటిగా ఉంది. తొలిసారిగా ఈ కారును 2005 సంవత్సరంలో భారత మార్కెట్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు.
మారుతి సుజుకి కొత్త జనరేషన్ స్విఫ్ట్ కారును ఇటీవలే జపాన్‌లో ఆవిష్కరించింది. భారత్‌లో ఈ హ్యాచ్‌బ్యాక్ రోడ్‌టెస్ట్ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఆ మధ్య వైరల్ అయింది. ఈ సంవత్సరంలోనే మారుతి సుజుకి స్విఫ్ట్ భారత్ మార్కెట్‌లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న స్విఫ్ట్‌ను 2018లో విడుదల చేశారు. అయితే స్విఫ్ట్ ఫోర్త్ జనరేషన్ హ్యాచ్‌బ్యాక్‌లో అనేక మార్పులతో తీసుకొస్తున్నారు.
ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్ 13 రంగుల్లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఆ రంగులు ఇవే!
- ప్యూర్ వైట్ పెర్ల్ మెటాలిక్
- ప్రాంటియర్ బ్లూ పెర్ల్ మెటాలిక్
- బర్నింగ్ రెడ్ పెర్ల్ మెటాలిక్
- కారవాన్ ఐవరీ మెటాలిక్
- కూల్ ఎల్లో మెటాలిక్
- ఫ్లేమ్ ఆరెంజ్ పెర్ల్ మెటాలిక్
- ప్రీమియం సిల్వర్ మెటాలిక్
- స్టార్ సిల్వర్ మెటాలిక్
- సూపర్ బ్లాక్ పెర్ల్
దీంతో పాటు నాలుగు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లు సైతం కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. అవేంటంటే?
- బ్లాక్ రూఫ్‌తో బర్నింగ్ రెడ్ పెర్ల్ మెటాలిక్,
- బ్లాక్ రూఫ్‌తో ఫ్రాంటియర్ బ్లూ పెర్ల్ మెటాలిక్
- గన్ మెటాలిక్ రూఫ్‌తో కూడిన కూల్ ఎల్లో మెటాలిక్
- గన్ మెటాలిక్ రూఫ్‌తో ప్యూర్ వైట్