తెలంగాణ

telangana

బెజోస్‌ను దాటేసిన మార్క్‌ జుకర్‌బర్గ్‌ - ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానం - Bloomberg Billionaires Index

World's Richest People : బ్లూమ్‌బెర్గ్‌ బిలయనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ప్రపంచ కుబేరుల జాబితాలో జెఫ్‌ బెజోస్‌ను దాటి తొలిసారిగా మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్ రెండో స్థానానికి చేరుకున్నారు.

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Published : 4 hours ago

Mark Zuckerberg and Jeff Bezos
Mark Zuckerberg and Jeff Bezos (ANI and AP)

World's Richest People : మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన రెండో స్థానానికి చేరుకున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడైన జెఫ్‌ బెజోస్‌ను దాటి తొలిసారిగా ఈ స్థానానికి చేరుకున్నారు మార్క్ జుకర్‌బర్గ్‌. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్ వెల్లడించింది.

నంబర్‌-1 ఎవరు?
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఫేస్‌బుక్ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపద ప్రస్తుతం 206 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సంపద 205 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇక ఈ జాబితాలో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్ 256 బిలియన్‌ డాలర్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు.

భారతీయ కుబేరుల సంగతేంటి?
ఇండియన్‌ బిలియనీర్లలో ముకేశ్‌ అంబానీ 107 బిలియన్‌ డాలర్ల సంపదతో 14వ స్థానంలో ఉన్నారు. భారతదేశంలో ఆయనే అగ్రస్థానంలో ఉన్నారు. 100 బిలియన్‌ డాలర్లతో గౌతమ్‌ అదానీ 17వ స్థానంలో కొనసాగుతున్నారు.

కారణమిదే!
ఇటీవల మెటా షేర్లు అంచనాలకు మించి రాణించాయి. రెండో త్రైమాసికంలో అమ్మకాల్లో మెరుగైన వృద్ధి నమోదవ్వడం, ఏఐ చాట్‌బాట్‌లను మరింత శక్తివంతంగా మార్చేందుకు లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడళ్లను పెంచడం వల్లనే మెటా షేర్లు 23 శాతం వరకు పెరిగాయి. దీంతో గురువారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌లో మెటా సంస్థ షేరు విలువ ఆల్‌టైమ్‌ గరిష్ఠాన్ని తాకి 582.77 డాలర్ల వద్ద ముగిసింది. ఏఐ రేసులో ముందంజలో నిలిచేందుకు గాను డేటా సెంటర్‌లను, కంప్యూటింగ్‌ పవర్‌ను పెంచేందుకు మెటా పెద్ద ఎత్తున డబ్బుల్ని వెచ్చిస్తోంది. తాజాగా ఓరియన్‌ ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్‌ను కూడా పరిచయం చేసింది. ఇవన్నీ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపద భారీగా పెరగడానికి కారణమయ్యాయి.

బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్ ఇండెక్స్‌

ర్యాంక్‌ పేరు సంపద (డాలర్లలో) ఇండస్ట్రీ
1 ఎలాన్​ మస్క్ 256 బిలియన్​ టెక్నాలజీ
2 మార్క్‌ జుకర్‌బెర్గ్‌ 206 బిలియన్‌ టెక్నాలజీ
3 జెఫ్ బెజోస్​ 205 బిలియన్​ టెక్నాలజీ
4 బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ 193 బిలియన్​ కన్సూమర్​
5 లారీ ఎలిసన్‌ 179 బిలియన్​ టెక్నాలజీ
6 బిల్​ గేట్స్​ 161 బిలియన్​ టెక్నాలజీ
7 లారీ పేజ్​ 156 బిలియన్​ టెక్నాలజీ
8 స్టీవ్ బల్మెర్​ 145 బిలియన్​ టెక్నాలజీ
9 వారెన్ బఫెట్‌ 143 బిలియన్​ డైవర్సిఫైడ్​
10 సెర్గీ బ్రిన్​ 141 బిలియన్​ టెక్నాలజీ
11 అమాన్సియో ఒర్టెగా 114 బిలియన్‌ రిటైల్​
12 మైఖేల్ డెల్​ 110 బిలియన్​ టెక్నాలజీ
13 జెన్సన్ హువాంగ్ 107 బిలియన్​ టెక్నాలజీ
14 ముకేశ్ అంబానీ 107 బిలియన్​ ఎనర్జీ
17 గౌతమ్ అదానీ 100 బిలియన్​ ఇండస్ట్రియల్​
49 సావిత్రి జిందాల్‌ 35.8 బిలియన్‌​ కమోడిటీస్‌

ABOUT THE AUTHOR

...view details