ETV Bharat / business

RX100 నుంచి బాబర్‌ వరకు - త్వరలో లాంఛ్‌కానున్న టాప్‌-10 బైక్స్ ఇవే! - Upcoming Bikes In India 2024 - UPCOMING BIKES IN INDIA 2024

Upcoming Bikes In India 2024 : త్వరలో లాంఛ్‌ కానున్న హీరో, హోండా, కవాసకి, రాయల్ ఎన్‌ఫీల్డ్‌, సుజుకి, యమహా బైక్స్ & స్కూటీస్‌పై ఓ లుక్కేద్దాం రండి.

Scooters
Motor cycles (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2024, 1:02 PM IST

Upcoming Bikes In India 2024 : భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద టూ-వీలర్ మార్కెట్‌గా ఉంది. అందుకే ఇక్కడ ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు, అన్ని వర్గాల కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ ఆరాటపడుతున్నాయి. అందులో భాగంగా తమ లేటెస్ట్ మోడల్ బైక్‌లను, స్కూటీలను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. వీటిలో 2024లో లాంఛ్ కానున్న టాప్‌-10 బైక్స్‌ & స్కూటీస్‌పై ఓ లుక్కేద్దాం రండి.

1. Hero Destini 125 : హీరో డెస్టిని 125 ఈ అక్టోబర్‌ నెలలోనే లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర బహుశా రూ.83,000 నుంచి రూ.90,000 రేంజ్‌లో ఉండవచ్చని అంచనా. ఈ స్కూటీలో 124.6 సీసీ సింగిల్ సిలిండర్‌ ఇంజిన్ అమర్చారు. ఇది 9 bhp పవర్, 10.4 Nm టార్క్‌ జనరేట్ చేస్తుంది. ఇది CVTతో అనుసంధానమై ఉంటుంది. ఈ స్కూటర్‌ లీటర్‌కు 59 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. మార్కెట్లో దీనికి సుజుకి యాక్సెస్‌ 125, టీవీఎస్‌ జూపిటర్‌ 125ల మధ్య గట్టిపోటీ ఉండనుంది.

2. Kawasaki KLX 230 S : 'కవాసకి కేఎల్‌ఎక్స్‌ 230 ఎస్‌' బైక్ కూడా అక్టోబర్‌లోనే విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. దీని ధర బహుశా రూ.2,00,000 నుంచి రూ.2,10,000 వరకు ఉండవచ్చు. ఈ బైక్‌లో 233 సీసీ సామర్థ్యంగల ఇంజిన్ అమర్చారు. ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానమై పనిచేస్తుంది.

3. Hero Xoom 160 : హీరో జూమ్‌ 160 స్కూటీ కూడా ఈ అక్టోబర్‌లోనే ఇండియన్ మార్కెట్లోకి రానుంది. దీని ధర బహుశా రూ.1,10,000 నుంచి రూ.1,20,000 వరకు ఉంటుందని అంచనా. దీనిలో 156 సీసీ ఇంజిన్‌ అమర్చారు. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో పెయిర్ అయ్యుంటుంది. మార్కెట్లో దీనికి హోండా యూనికార్న్‌, బజాజ్ పల్సర్‌ 150, హీరో ఎక్స్‌ట్రీమ్‌ 160ఆర్‌ పోటీగా ఉంటాయి.

4. Royal Enfield Classic 350 Bobber : రాయల్ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 బాబర్‌ బహుశా నవంబర్‌లో లాంఛ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని ధర సుమారుగా రూ.2,00,000 నుంచి రూ.2,10,000 రేంజ్‌లో ఉండవచ్చు. ఈ మోటార్‌ సైకిల్‌లో 346 సీసీ ఇంజిన్‌ అమర్చారు. ఇది 20.2 bhp పవర్‌, 27 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానమై ఉంటుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు. మార్కెట్లో దీనికి జావా పెరాక్‌, జావా 42 బాబర్‌ గట్టిపోటీగా నిలవనున్నాయి.

5. Royal Enfield Scrambler 650 : రాయల్ ఎన్‌ఫీల్డ్‌ స్క్రాంబ్లర్ 650 కూడా నవంబర్‌లో లాంఛ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని ప్రైస్‌ రేంజ్‌ బహుశా రూ.3,00,000 నుంచి రూ.3,20,000 వరకు ఉండవచ్చు. మార్కెట్లో దీనికి డైరెక్ట్ రైవల్ అంటూ ఏదీ లేకపోవడం గమనార్హం.

6. Suzuki Burgman Street Electric : సుజుకి బర్గ్‌మాన్‌ స్ట్రీట్ ఎలక్ట్రిక్‌ బహుశా డిసెంబర్‌లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటీ ధర సుమారుగా రూ.1,05,000 నుంచి రూ.1,20,000 వరకు ఉంటుంది. మార్కెట్లో దీనికి టీవీఎస్‌ ఐక్యూబ్‌, బజాజ్‌ చేతక్‌ బైక్‌ల నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది.

7. Hero XPulse 210 : హీరో ఎక్స్‌పల్స్‌ 210 బహుశా 2024 డిసెంబర్‌లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. దీని ధర సుమారుగా రూ.1,50,000 నుంచి రూ.1,70,000 వరకు ఉంటుంది. మార్కెట్లో దీనికి బజాజ్‌ పల్సర్‌ ఎన్‌250, బజాజ్‌ పల్సర్‌ ఎఫ్‌250 పోటీగా ఉండనున్నాయి. ఈ బైక్‌లో 210 సీసీ, లిక్విడ్‌-కూల్డ్‌ ఇంజిన్‌ అమర్చే అవకాశం ఉంది. దీనిలో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, ఫుల్‌ ఎల్‌ఈడీ లైటింగ్‌, స్విచబుల్‌ ఏబీఎస్‌ కూడా ఉండవచ్చని అంచనా.

8. Hero 2.5R Xtunt : 'హీరో 2.5ఆర్‌ ఎక్స్‌టంట్' బైక్ బహుశా డిసెంబర్‌లో ఇండియన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ప్రైస్‌ రేంజ్‌ రూ.1,65,000 నుంచి రూ.1,70,000 వరకు ఉండవచ్చు. మార్కెట్లో దీనికి సీబీ200ఎక్స్‌, బజాజ్‌ పల్సర్‌ ఎన్‌250 రైవల్స్‌గా ఉంటాయి.

9. Yamaha RX 100 : ఇండియాలోని మోస్ట్ పాపులర్ బైక్‌ల్లో ఆర్‌ఎక్స్‌ 100 ఒకటి. దీని లేటెస్ట్ వెర్షన్‌ బహుశా 2025 జనవరిలో లాంఛ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని ధర రూ.1,40,000 నుంచి రూ.1,50,000 వరకు ఉండే అవకాశముంది. దీనిలో 100 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంటుంది. ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానమై ఉంటుంది.

10. Honda CBR300R : హోండా సీబీఆర్‌300ఆర్ డిసెంబర్లో లాంఛ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని ధర సుమారుగా రూ.2,00,000 నుంచి రూ.2,29,999 వరకు ఉండవచ్చు. దీనిలో 286 సీసీ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 6 స్పీడ్‌ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేస్తుంది. మార్కెట్లో దీనికి కేటీఎం ఆర్‌సీ390, యమహా వైజెడ్‌ఎఫ్‌-ఆర్3, కవాసకి నింజా300 పోటీగా ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.