Kinetic E-Luna :ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో కైనెటిక్ ఇ-లూనాకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది చాలా సింపుల్ లుక్‌తో ఉంటుంది. కానీ ఎక్కువ వస్తువులను, అధిక బరువులను సులువుగా మోసుకెళ్లడానికి అనువుగా ఉంటుంది. అందుకే చిరు వ్యాపారులు ఎక్కువగా ఈ కైనెటిక్ ఇ-లూనాను కొనేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అందుకే కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో దీనికి తిరుగులేని పాపులారిటీ వచ్చింది. అయితే ప్రస్తుతం దీనికి ఒకినావా డ్యూయల్-100, ఒడిస్సే ట్రోట్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మరి ఈ మూడింటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అవుతుందో చూద్దామా?
డిజైన్, డైమెన్షన్
Kinetic E-Luna Vs Rivals : Design And Dimension
కైనటిక్ ఇ-లూనా, ఒకినావా డ్యూయెల్-100, ఒడిస్సే ట్రోట్ల డిజైన్ దాదాపు ఒకేలా ఉంటుంది. కానీ వీడి మోపెడ్లు చాలా భిన్నంగా ఉంటాయి. ఫ్లోర్‌బోర్డ్స్, స్ప్లిట్ సీట్స్, టెలిస్కోపిక్ ఫోర్క్స్, డ్రమ్ బ్రేక్స్‌తో, చిరు వ్యాపారులు ఉపయోగించుకోవడానికి చాలా అనువుగా ఉంటాయి.
డైమెన్షన్ | ఇ-లూనా | డ్యూయల్-100 | ట్రోట్ |
పొడవు | 1985 mm | 1788 mm | 1820 mm |
వెడల్పు | 735 mm | 700 mm | 700 mm |
ఎత్తు | 1036 mm | 1120 mm | 1100 mm |
గ్రౌండ్ క్లియరెన్స్ | 170 mm | 205 mm | 180 mm |
లోడింగ్ కెపాసిటీ | 150 kg | 150 kg | 250 kg |
Kinetic E-Luna Vs Rivals : Features
కైనెటిక్ ఇ-లూనాలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, 16-ఇంఛ్ వైర్-స్పోక్ వీల్స్, హాలోజన్ లైట్లు ఉంటాయి. ఒకినావా డ్యూయెల్-100లో కూడా ఇదే విధమైన ఫీచర్లు ఉంటాయి. కానీ దీనిలో ఒడిస్సే ట్రోట్లాగా అల్లాయ్ వీల్స్ ఉంటాయి. అలాగే దీనిలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12-ఇంఛ్ వీల్స్ ఉంటాయి.