Income tax relief in Budget 2025 :మోదీ 3.O ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రవేశ పెట్టనున్న వార్షిక బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తక్కువ ఆదాయం గల వారికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉపశమనం కల్పించేలా ప్రకటనలు చేయొచ్చని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పాత, కొత్త పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. అయితే గత కొన్ని బడ్జెట్ల్ల్లో పాత పన్ను విధానంలో పెద్దగా మార్పులు చేయని కేంద్రం, కొత్త పన్ను విధానంలో సవరణలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఈసారి కూడా జీరో ట్యాక్స్ శ్లాబును పెంచే అవకాశాలున్నట్లు కథనాలు తెలిపాయి.
ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షలదాకా వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్నులూ లేవు. రూ.3-7 లక్షల మధ్య ఉంటే 5శాతం పన్ను ఉంటుంది. అయితే కేంద్రం ఆ పన్నుశాతాన్ని తగ్గించే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆధికారిక సమాచారం లేదు. కానీ, ఈ మార్పులు కేవలం ఆదాయం వచ్చే వారికే ఉంటుందని సమచారం. ఎక్కువ ఆదాయం పన్ను శాతాల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని కథనాల్లో పేర్కొన్నాయి.