How To Use Credit And Debit Card In GPay :దేశంలో కొన్నేళ్లుగా డిజిటల్ పేమెంట్స్ బాగా పెరుగుతున్నాయి. ప్రతిదానికీ యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో చిన్నచిన్న షాపులు మొదలు, పెద్ద స్థాయిలో నిర్వహించే వ్యాపారాల వరకూ, యూపీఐ పేమెంట్స్‌ను అనుమతిస్తున్నాయి. మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ యాప్‌ల్లో 'గూగుల్ పే' ఒకటిగా ఉంది. కూరగాయలు కొనడం నుంచి రైలు, విమాన టికెట్ బుకింగ్‌ల వరకు ఈ యాప్‌నే చాలా మంది వినియోగిస్తున్నారు. అయితే గూగుల్ పేతో యూపీఐ పేమెంట్స్ చేయడమే కాదు. దానికి క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను కూడా లింక్ చేసుకోవచ్చు. వాటి ద్వారా ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లోనూ పేమెంట్స్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
గూగుల్ పే యాప్‌నకు క్రెడిట్, డెబిట్ కార్డులు లింక్ చేయడం ఎలా?
How To Add Credit And Debit Cards In GPay :
- ముందుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీ ఫోన్లోకి Google Pay యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేయాలి.
నోట్ : చాలా ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రీ-ఇన్స్టాల్డ్ యాప్‌గా గూగుల్ పే ఉంటుంది. ఐఫోన్ యూజర్లు అయితే ప్లేస్టోర్ నుంచి Gpayను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- మీ జీ-మెయిల్ అకౌంట్‌తో గూగుల్ పే యాప్‌లోకి సైన్-ఇన్ కావాలి.
- మీ ఫోన్లో లాగ్-ఇన్ అయిన ఈ-మెయిల్ అకౌంట్, గూగుల్ పేలో సైన్-ఇన్ అయిన ఈ-మెయిల్ అకౌంట్ ఒకటే అయ్యుండాలి.
- ఆ తర్వాత మీ ప్రొఫైల్ పిక్‌పై క్లిక్ చేయాలి.
- Payment Methods ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అక్కడ మీకు కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి.
- యాడ్ బ్యాంక్ అకౌంట్,
- సెట్-అప్ యూపీఐ లైట్
- యాడ్ క్రెడిట్ లైన్
- యాడ్ రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ
- అదర్ వేస్ టు పే
- ఈ Other ways to pay సెక్షన్లోకి వెళ్లి, మీ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను యాడ్ చేసుకోవచ్చు.
- ఇందుకోసం Add Cardపై క్లిక్ చేయాలి.