How To Transfer PF Online :ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారడం సర్వసాధారణం. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది తమ పీఎఫ్ అకౌంట్లోని డబ్బులు విత్‌డ్రా చేసేస్తుంటారు. మరికొందరు కొత్త పీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటారు. కానీ ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఒక ఉద్యోగికి ఒక పీఎఫ్ అకౌంట్ ఉండడమే మంచిది. ఇందుకోసం మీరు ఉద్యోగం మారినప్పుడు మీ పీఎఫ్ అకౌంట్‌ను కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా మీరు ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ఓపెన్ చేయాలి.
- మీ UAN, పాస్‌వర్డ్‌లతో పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.
- Online Services సెక్షన్లోకి వెళ్లి One Member - One EPF Account (ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ప్రస్తుత పీఎఫ్ అకౌంట్లోని మీ వ్యక్తిగత వివరాలను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి.
- ఆ తరువాత Get Details మీద క్లిక్ చేసి, మీ పాత పీఎఫ్ అకౌంట్ వివరాలను చెక్ చేసుకోవాలి.
- మీ పీఎఫ్ అకౌంట్‌కు డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ఉంటే, మీరే స్వయంగా క్లెయిమ్ ఫారాన్ని ధ్రువీకరించుకోవచ్చు.
- లేదా మీ మునుపటి లేదా ప్రస్తుత యజమానుల ద్వారా కూడా పీఎఫ్ అకౌంట్‌ను ధ్రువీకరించుకోవచ్చు.
- తరువాత మీ ప్రస్తుత యజమానిని సెలెక్ట్ చేసుకోవాలి. మెంబర్ ఐడీ లేదా UAN వివరాలను ఎంటర్ చేయాలి.
- Get OTP మీద క్లిక్ చేస్తే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి Submit బటన్‌పై క్లిక్ చేయాలి.
- వెంటనే 'పీఎఫ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఫారం' జెనరేట్ అవుతుంది. దీనిపై మీరు సెల్ఫ్-అటాస్ట్ చేసి, మీ కొత్త యాజమాన్యానికి పంపించాలి.
- ఈ EPF టాన్స్ఫర్కు సంబంధించిన నోటిఫికేషన్ మీ యాజమానికి కూడా వెళ్తుంది.
- ఈ విధంగా మీ పీఎఫ్ అకౌంట్‌ను సులువుగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
PF Benefits : సాధారణంగా ఉద్యోగికి ఇచ్చే జీతంలో 12 శాతాన్ని పీఎఫ్ అకౌంట్లోకి జమ చేస్తారు. సదరు కంపెనీ కూడా ఇంతే మొత్తాన్ని ఉద్యోగి ఖాతాలో జమ చేస్తుంది. దీనిపై మంచి వడ్డీ జనరేట్ అవుతుంది. ఫలితంగా ఉద్యోగ విరమణ తరువాత సదరు వ్యక్తికి పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. పైగా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఒక వేళ మీరు కంపెనీలో చేరిన 5 ఏళ్లలోపు మీ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు తీసేస్తే, అప్పుడు మీరు ప్రభుత్వానికి టాక్స్ కట్టాల్సి వస్తుంది. కనుక పీఎఫ్ అకౌంట్లోని డబ్బులను నిబంధనల ప్రకారం, నిర్దిష్ట కాలపరిమితి వరకు విత్‌డ్రా చేయకపోవడమే మంచిది. అయితే పిల్లల వివాహం, ఇళ్లు నిర్మాణం సహా, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ డబ్బులను వాడుకోవచ్చు.