తెలంగాణ

telangana

ETV Bharat / business

ఘాట్ ​రోడ్లపై కారు ఎలా నడపాలి? - ఈ టిప్స్ కచ్చితంగా పాటించాలి! - Safety Tips for Driving on Ghats

Driving Tips for Ghat Roads : సరదాగా లాంగ్ డ్రైవ్​కు వెళ్లడం చాలా మందికి ఇష్టం. ఘాట్​రోడ్లపై జర్నీని మరింతగా ఇష్టపడుతుంటారు. అయితే.. ఘాట్​రోడ్డుపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. లేదంటే ఊహించని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. మరి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి టిప్స్ పాటించాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

Ghat Roads
Safe Driving Tips for Ghat Roads

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 11:38 AM IST

Safe Driving Tips for Ghat Roads :చదునుగా ఉండే ప్రాంతాలపై డ్రైవింగ్(Driving)చేయడం ఒక ఎత్తు.. ఘాట్​రోడ్లపై డ్రైవింగ్ చేయడం మరో ఎత్తు! భారీ వంపులు, ఎత్తు పల్లాలు కలిగిన ఘాట్​ రోడ్లపై జర్నీ ఎంత ఆహ్లాదరకరంగా ఉంటుందో.. తేడా వస్తే అంతే అపాయకరమైనది కూడా! అందుకే.. ఇక్కడ కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం!

సరైన గేర్ యూజ్ చేయడం : మీరు ఘాట్​రోడ్డుపై డ్రైవింగ్ చేసేటప్పుడు మీ ప్రయాణం సురక్షితంగా సాగాలంటే గుర్తుంచుకోవాల్సిన మొదటి అంశం.. సరైన గేర్​ను ఉపయోగించడం. సాధారణంగా నార్మల్​ రోడ్లపై 40కి.మీ వేగాన్ని దాటగానే 5వ గేర్ వేస్తుంటాం. కానీ.. ఘాట్​రోడ్లపై జర్నీ చేసేటప్పుడు ఆచితూచి గేర్స్ మార్చాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు లోయర్ గేర్స్​లోనే వెళ్లడం మంచిది. ఇలా వెళ్లడం వల్ల వాహనం మంచి పికప్​ అందుకుంటుంది. ఇక కొందరైతే ఎత్తైన ప్రాంతాల్లో కింది వైపునకు వెళ్లేటప్పుడు వెహికల్​ను న్యూట్రల్​లో ఉంచి డ్రైవ్ చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలా నడపడం బ్రేక్ ఫెయిల్​కు దారితీసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

హ్యాండ్ బ్రేక్ వాడడం : కొండ ప్రాంతాల్లో, ఘాట్ రోడ్లపై వెహికల్ నడిపేటప్పుడు హ్యాండ్ బ్రేక్ యూజ్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. కొందరికి బాగా ఎత్తుగా ఉండే రోడ్లపై వాహనాన్ని నడుపుతున్నప్పుడు యాక్సిలరేషన్​, క్లచ్​ను సమానంగా అప్లై చేయడం తెలిసి ఉండకపోవచ్చు లేదా ఒక్కోసారి కుదరకపోవచ్చు. కాబట్టి మీరు ఎత్తైన ప్రాంతాలు, ఘాట్స్​పై జర్నీ చేసేటప్పుడు అవసరమైనప్పుడల్లా హ్యాండ్ బ్రేక్​నూ యూజ్ చేయడం మంచిది.

ఓవర్‌టేకింగ్​ :ఘాట్​రోడ్డుపై డ్రైవ్ చేస్తున్నప్పుడు ఓవర్​టేక్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహారించాలి. చాలా మంది మామూలు రోడ్లపై ముందున్న వాహనాన్ని ఓవర్​టేక్ చేసినట్లు ఘాట్స్​పై కూడా చేస్తుంటారు. కానీ.. అది కొన్ని సార్లు పెనుప్రమాదానికి దారి తీయవచ్చంటున్నారు నిపుణులు. ఒకవేళ ఘాట్​రోడ్లపై ఓవర్​టేక్ చేయాలనుకుంటే.. నేరుగా ఉండే రోడ్డుపై, ముందున్న డ్రైవర్​కు హారన్ లేదా లైట్స్ ద్వారా సంకేతమిస్తూ ముందుకు వెళ్లాలి. మలుపులు ఉన్నచోట అస్సలు ఓవర్ టేక్ చేయకూడదు.

ఈ సంకేతాలు కనిపిస్తే - మీ కారు బ్రేక్స్ ఫెయిల్ కాబోతున్నట్టే!

మలుపుల వద్ద ఇలా :ఘాట్ రోడ్లపై సేఫ్​గా వెహికల్​ను టర్న్ తీసుకోవాలంటే.. గేరును 2 లేదా 3 లోకి ఛేంజ్ చేసుకోవాలి. అంతేకానీ, వేగంగా ఎప్పుడూ వాహనాన్ని టర్న్ చేయాలని చూడకండి. అలా చేశారంటే వాహనం లోయలోకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో పాటు ఘాట్స్​పై మలుపుల వద్ద హారన్​ మస్ట్​గా యూజ్ చేయడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇక రాత్రివేళ్లలో అయితే హారన్​తో పాటు మీ హెడ్‌లైట్లను బ్లింక్ చేయటం లేదా హాజర్డ్ లైట్లను ఉపయోగించి డ్రైవ్ చేయటం సురక్షితం.

ఆపాల్సి వస్తే ఇలా చేయడం :మీరు ఘాట్ రోడ్లపై వెహికల్ ఆపాల్సి వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఇతర వాహనాలకు ఇబ్బంది కల్గించకుండా రోడ్డుకు పక్కగా, సెఫ్టీ ప్లేస్ చూసుకొని వెహికల్​ను నిలపాలి. సన్నగా లేదా ఇరుకుగా ఉండే రోడ్లపై వాహనాన్ని ఆపడం మంచిది కాదు.

వీటితోపాటు.. మామూలు రోడ్లపై నడిపినంత స్పీడ్​గా నడపకూడదు. ఓర్పు, సహనం పాటిస్తూ డ్రైవ్ చేయడం సురక్షితం. అలాగే.. కంగారు పడకుండా, భయాలను పక్కనపెట్టి ధైర్యంగా డ్రైవ్ చేయడం చాలా ముఖ్యం. వీటితోపాటు రేసింగ్ లైన్స్ యూజ్ చేయకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

కారు ఇంజిన్‌లో ఎలుకలు దూరి అంతా పాడు చేస్తున్నాయా? - ఈ టిప్స్​తో అవి పరార్‌!

ABOUT THE AUTHOR

...view details