How to get Refund for Wrong UPI Transaction : యూపీఐ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఆర్బీఐ కొత్త రూల్ ప్రకారం, ఇకపై యూపీఐ ద్వారా రాంగ్ నంబర్‌కు పంపించిన డబ్బులను, మీరు 24 గంటల నుంచి 48 గంటల్లోపు వెనక్కు తీసుకోవచ్చు. పంపించిన వ్యక్తి, ఆ డబ్బులు పొందిన వ్యక్తి, ఇద్దరు కూడా ఒకే బ్యాంక్ ఖాతాదారులు అయ్యుంటే, రీఫండ్ త్వరగా వస్తుంది. ఒకవేళ వారి అకౌంట్లు వేర్వేరు బ్యాంకులకు సంబంధించినవి అయితే, ఈ రీఫండ్ రావడం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది.
యూపీఐ పద్ధతిని అభివృద్ధి చేసిన ఎన్పీసీఐ, సింగిల్ మొబైల్ యాప్‌నకు అనేక బ్యాంకు అకౌంట్లను లింక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అందువల్ల యూజర్లు చాలా సులువుగా డబ్బులు పంపడానికి, బిల్లులు పే చేయడానికి, ఆన్లైన్ షాపింగ్ చేయడానికి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వివరాలు తెలుసుకోవడానికి వీలవుతోంది. ఇంత వరకు ఓకే. ఇప్పుడు మనం UPIద్వారా రాంగ్ అకౌంట్‌కు డబ్బులు పంపించి ఉంటే, దాని గురించి Paytm, BHIM, Google Pay, PhonePe వంటి UPI యాప్‌లలో ఏ విధంగా రిపోర్ట్ చేయాలో తెలుసుకుందాం.
Paytm UPI :మీరు Paytm ద్వారా రాంగ్ అకౌంట్‌కు డబ్బులు పంపినట్లయితే, మీరు నేరుగా ఆ వ్యక్తిని సంప్రదించి మీ మనీ తిరిగి ఇవ్వమని అడగాలి. అది వీలుకాకపోతే, రిసీవర్ బ్యాంక్‌ను సంప్రదించాలి. అప్పటికీ ఫలితం లేకపోతే Paytm కస్టమర్ కేర్‌ను సంప్రదించాలి.
- మొదట మీ ఫోన్‌లో పేటీఎం యాప్‌ను ఓపెన్ చేసి ఎగువ ఎడమవైపున ఉన్న ప్రొఫైల్ పిక్చర్ మెనుపై నొక్కాలి.
- ఆ తర్వాత క్రిందికి స్క్రోల్ చేసి 24×7 Help and Support అనే ఆప్షన్‌పై నొక్కాలి.
- అనంతరం మళ్లీ స్క్రోల్ డౌన్ చేసి View All Servicesపై క్లిక్ చేయాలి.
- UPI Payment & Money Transfer అనే విభాగానికి వెళ్లాలి.
- అక్కడ మీరు చేసిన wrong transactionను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత మీరు ఫిర్యాదు చేయడానికి, రీఫండ్ ప్రక్రియను ప్రారంభించడానికి Paytm అసిస్టెంట్‌తో చాట్‌ని ప్రారంభించాలి. జరిగిన విషయం చెప్పాలి.
- అప్పుడు Paytm బృందం రిసీవర్ని సంప్రదించి, మీరు యూపీఐ ద్వారా పంపిన మొత్తాన్ని రీఫండ్ చేస్తుంది.
BHIM UPI :
- మొదట మీరు BHIM యాప్ ఓపెన్ చేసి, ఎగువ కుడివైపు ఉన్న Hamburger Menu (మూడు లైన్లు)పై నొక్కాలి.
- ఆ తర్వాత Raise Complaint అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీరు ఫిర్యాదు చేయాలనుకుంటున్న లావాదేవీని ఎంచుకోవాలి.
- ఆ తర్వాత ఆన్‌లైన్‌లో వివరాలను పూరించడానికి Raise a Concernపై నొక్కాలి. లేదా
- టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలియజేయడానికి మీరు కాల్ బ్యాంక్‌పై నొక్కాలి.