తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫేక్ GST బిల్లులను ఎలా గుర్తించాలి? ఎలా రిపోర్ట్ చేయాలి? - How To Identify Fake GST Bill - HOW TO IDENTIFY FAKE GST BILL

How To Identify Fake GST Bill : కొంత మంది వ్యాపారులు నకిలీ జీఎస్​టీ బిల్లులు ఇచ్చి వినియోగదారులను మోసగిస్తున్నారు. అందుకే ఫేక్ జీఎస్​టీ బిల్లుల విషయంలో కస్టమర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. అసలు నకిలీ జీఎస్​టీ బిల్లులను ఎలా గుర్తించాలి? దాని గురించి అధికారులకు ఎలా ఫిర్యాదు చేయాలి? తదితర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

How To Identify Fake GST Bill
How To Identify Fake GST Bill (ANI)

By ETV Bharat Telugu Team

Published : Aug 21, 2024, 5:56 PM IST

How To Identify Fake GST Bill : పన్ను ఎగవేతలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2017లో జీఎస్​టీ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఇప్పటికీ చాలా చోట్ల జీఎస్​టీ ఎగవేత, నకిలీ బిల్లుల ఉదంతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. హోటల్, కొన్ని షోరూమ్స్, దుకాణాల్లో జీఎస్​టీ బిల్లులను ఇస్తుంటారు. అందులో కొన్ని నకిలీవి ఉంటాయి. అందుకే మోసాలను అరికట్టేందుకు, మీ నుంచి జీఎస్​టీ పేరుతో అదనపు సొమ్ము కొల్లగొట్టకుండా ఉండేందుకు బిల్లుల ప్రామాణికత తెలుసుకోవడం చాలా ముఖ్యం.

నకిలీ జీఎస్​టీని గుర్తించడం ఎలా?
వెరిఫై GSTIN
వస్తు, సేవలు అందించే వ్యక్తులకు లేదా సంస్థలకు ప్రత్యేకమైన 15 అంకెల GSTINను కేటాయిస్తారు. ఇందులో రాష్ట్ర కోడ్, సరఫదారుని పాన్ నంబర్, ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. మీకు సప్లయర్​ బిల్లు ఇచ్చిన వెంటనే, అందులోని GSTINని చెక్ చేయాలి. జీఎస్​టీ పోర్టల్​లో దానిని ఎంటర్ చేయాలి. ఒక వేళ సదరు GSTIN సరైనదే అయితే, జీఎస్​టీ పోర్టల్​లో పన్ను చెల్లింపుదారు రకం, రిజిస్ట్రేషన్ తేదీ, రిజిస్ట్రేషన్ స్థానం (రాష్ట్రం), చట్టపరమైన పేరు, వ్యాపారం, వాణిజ్యం పేరు, UIN లేదా GSTIN స్టేటస్ కనిపిస్తాయి. అప్పుడు మీకు ఇచ్చిన బిల్లు అసలైనదో? నకిలీదో? తేలిపోతుంది.

ఇన్​వాయిస్ నంబరు చెక్ చేయండి
మీకు ఇచ్చిన జీఎస్​టీ బిల్లులోని ఇన్ ​వాయిస్ నంబర్​, తేదీలను కూడా చెక్ చేయాలి. ఈ ఇన్​​వాయిస్ నంబర్​ యూనిక్​గా, వరుస క్రమంలో ఉండాలి. మరీ ముఖ్యంగా మీరు వస్తు, సేవలు కొన్న నిర్ణీత టైమ్ కూడా దానిలో నమోదై ఉండాలి.

వెరిఫై ఇన్​వాయిస్ వాల్యూ
జీఎస్​టీ బిల్లులో మీరు కొనుగోలు చేసిన వస్తు, సేవల విలువ, దానిపై విధించిన పన్ను మొత్తం ఉంటుంది. అందుకే మీరు జీఎస్​టీ వెబ్​సైట్​లోని కాలిక్యులేటర్ ఓపెన్ చేసి, ఇన్​వాయిస్​లోని డబ్బులకు సరిపడా జీఎస్​టీ వేశారా? లేదా ఎక్కువ వసూలు చేస్తున్నారా? అనేది చెక్ చేసుకోవాలి.

సరఫరాదారుని సంతకం
అలాగే జీఎస్​టీ బిల్లులో సప్లయర్ లేదా అతని అధీకృత ప్రతినిధి సంతకం ఉండాలి. బిల్లుపై కనిపించే ఆ సంతకం జీఎస్​టీ పోర్టల్​లో ఉన్న సంతకంతో సరిపోలుతుందో లేదో తనిఖీ చేయాలి.

ట్యాక్స్ పేమెంట్ స్టేటస్
చివరగా కస్టమర్లు జీఎస్​టీ పోర్టల్‌లోని సప్లయర్​ టాక్స్ పేమెంట్ స్టేటస్​ను కూడా చెక్ చేయవచ్చు. ఒక వేళ జీఎస్​టీ పోర్టల్​లో సదరు సప్లయర్​ వివరాలు కనిపించలేదంటే, అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడని తెలుసుకోండి.

ఫిర్యాదు చేయండిలా!
ఒకవేళ మీరు నకిలీ జీఎస్​టీ బిల్లును గుర్తించినట్లైతే నేరుగా జీఎస్​టీ పోర్టల్​​లోనే ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే పోర్టల్​​లోని టోల్​-ఫ్రీ నంబర్​కు ఫోన్ చేసి రిపోర్ట్ చేయవచ్చు.

జీఎస్టీ రిటర్న్ అంటే ఏమిటి? దీనిని ఎవరు దాఖలు చేయాలి? - What Is GST Return

ABOUT THE AUTHOR

...view details