తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ సిబిల్‌ స్కోర్​ను ఉచితంగా చెక్ చేసుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - HOW TO CHECK CIBIL SCORE FOR FREE

మీ క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలా? ఆన్‌లైన్‌లో చాలా సింపుల్​గా చెక్​ చేసుకోండిలా!

Credit Score
CIBIL Score (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 14 hours ago

How To Check CIBIL Score For Free :పర్సనల్‌ లోన్‌ నుంచి కార్‌ లోన్‌ వరకు ప్రతిదానికి కచ్చితంగా మంచి క్రెడిట్ స్కోర్‌ ఉండాల్సిందే. దీనినే కొందరు సిబిల్ స్కోర్‌ అని కూడా అంటారు. వాస్తవానికి ఈ క్రెడిట్‌ స్కోర్‌ను క్రెడిట్ బ్యూరోలు ఇస్తుంటాయి. భారతదేశంలో ప్రధానంగా నాలుగు క్రెడిట్ బ్యూరో సంస్థలు ఉన్నాయి. అవి:

1. సిబిల్

2. ఎక్స్‌పీరియన్‌

3. సీఆర్‌ఐఎఫ్‌

4. ఈక్విఫాక్స్‌

ఈ క్రెడిట్‌ బ్యూరోలు వినియోగదారుల క్రెడిట్ రిపోర్ట్‌లు రూపొందించడానికి, వారి సమాచారాన్ని సేకరిస్తాయి. వాటిని ఆర్గనైజ్ చేసి, వ్యక్తుల క్రెడిట్ స్కోర్‌ను నిర్ణయిస్తాయి. వీటిలో సిబిల్ అనేది చాలా పాపులర్. అందుకే క్రెడిట్ స్కోర్‌ను వాడుకలో సిబిల్ స్కోర్ అని కూడా పిలుస్తుంటారు.

క్రెడిట్ స్కోర్ ఉపయోగం ఏమిటి?
క్రెడిట్ స్కోర్‌ ఆధారంగానే బ్యాంకులు, రుణసంస్థలు లోన్లు ఇస్తుంటాయి. వ్యక్తుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో క్రెడిట్ స్కోర్​/ సిబిల్‌ స్కోర్‌ తెలియజేస్తుంది. తీసుకున్న లోన్లు సమయానికి చెల్లిస్తున్నారా? లేదా ఏమైనా బకాయిలు ఉన్నాయా? ఇలా అన్ని విషయాలు సిబిల్ స్కోర్‌ ద్వారా తెలిసిపోతాయి.

క్రెడిట్‌ స్కోరును సాధారణంగా 300 నుంచి 900 వరకు లెక్కిస్తారు. క్రెడిట్‌ స్కోరు ఎంత ఎక్కువ ఉంటే ఆర్థిక పరిస్థితి అంత బాగున్నట్లు భావిస్తాయి బ్యాంకులు. క్రెడిట్‌ స్కోర్‌ 700కిపైగా ఉంటే రుణాలు ఈజీగా పొందవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు క్రెడిట్‌ స్కోర్​ను చెక్ చేసుకోవాలి. అందుకే ఈ ఆర్టికల్​లో పూర్తి ఉచితంగా మీ క్రెడిట్‌ స్కోర్‌ను ఎలా చెక్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.

How To Check Credit Score For Free

  • ముందుగా సిబిల్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://www.cibil.com/ ఓపెన్ చేయాలి.
  • వ్యక్తిగత సిబిల్ స్కోర్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • తరువాత Get Your Free CIBIL scoreపై క్లిక్ చేయాలి.
  • మీ ఈ-మెయిల్ ఐడీ ద్వారా అకౌంట్‌ను ఓపెన్‌ చేసుకోవాలి.
  • తర్వాత మీ పేరు ఎంటర్‌ చేయాలి.
  • పాన్‌ కార్డ్‌ నంబరు/ పాస్‌పోర్ట్​/ ఓటర్‌ ఐడీ/ డ్రైవింగ్ లైసెన్స్‌/ రేషన్​ కార్డ్​ నంబర్లలో ఏదో ఒక దానిని ఎంటర్ చేయాలి.
  • మీ పుట్టిన తేదీ, పిన్ కోడ్‌లను ఎంటర్ చేసి రాష్ట్రాన్ని ఎంచుకోండి.
  • తర్వాత మీ ఫోన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి, కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • వెంటనే మీ రిజిస్టర్డ్​ మొబైల్​​ నంబర్​కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్‌ చేసిన కంటిన్యూ బటన్​పై క్లిక్‌ చేయాలి.
  • ఆ తర్వాత మీ అకౌంట్​ను మీరు వినియోగిస్తున్న సిస్టమ్‌తో యాడ్ చేయాలని అనుకుంటున్నారా? అని అడుగుతుంది.
  • మీ ప్రాధాన్యతలను బట్టి YES లేదా No ఆప్షన్‌పై క్లిక్ చేయండి. దీనితో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
  • ఆ తర్వాత Go To Dashboard ఆప్షన్​పై క్లిక్‌ చేయాలి.
  • వెంటనే మీ సిబిల్‌ స్కోర్‌ కనిపిస్తుంది. ఈ విధంగా మీరు పూర్తి ఉచితంగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు.

నోట్​ : సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇలా పూర్తి ఉచితంగా మీ సిబిల్ స్కోర్ చూడడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంకా ఎక్కువ సార్లు మీ క్రెడిట్ స్కోర్​ను చెక్​ చేసుకోవాలంటే, ప్రీమియం ప్లాన్స్​ను సబ్​స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా యాప్​లు, వెబ్​సైట్​లు కూడా ఉచితంగా క్రెడిట్ స్కోర్​ను చూపిస్తున్నాయి. వాటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, అవసరానికి మించి ఎక్కువ సార్లు చెక్ చేస్తూ ఉంటే, మీ క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.

పెళ్లి చేసుకుంటే క్రెడిట్ స్కోర్‌పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ - ఎలా అంటే?

మీ క్రెడిట్ స్కోర్ 800కు పైగా ఉందా? కోరుకున్న ఉద్యోగం, తక్కువ వడ్డీకే బ్యాంక్‌ లోన్‌, ఇన్సూరెన్స్ ప్రీమియంపై డిస్కౌంట్ గ్యారెంటీ!

ABOUT THE AUTHOR

...view details