How To Block Lost Credit Card : ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు అనేది అందరి చేతిలో కామన్ అయిపోయింది. డబ్బులు చేతిలో లేనప్పుడు మనల్ని అవసరాల నుంచి గట్టేక్కించేవి ఈ కార్డులే . అయితే అనుకోకుండా ఎప్పుడైనా మన క్రెడిట్ పోయినా లేదా ఎవరైనా దొంగిలించినా దానిని వెంటనే బ్లాక్ చేయకుంటే చాలా ప్రమాదం. వైఫై యాక్సిస్ ఉన్న క్రెడిట్ కార్డులకు అయితే ఈ రిస్క్ మరింత ఎక్కువ. అయితే క్రెడిట్ కార్డు పోయినప్పుడు సులభంగా మెుబైల్లోనే కార్డును బ్లాక్ చేసే మార్గాలు తెలుసుకోవాలనుందా? అయితే వెంటనే ఈ స్టోరీ చదవండి.
1. కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలి :మీ కార్డు పోయిందని గమనించిన వెంటనే మీరు చేయాల్సిన మొదటి పని మీ బ్యాంకు కస్టమర్ కేర్‌కు కాల్ చేయటం. సాధారణంగా బ్యాంకు టోల్ ఫ్రీ నెంబర్ కార్డు వెనుక భాగంలో ఉంటుంది. ఒకవేళ అలా లేని పక్షంలో టోల్ ఫ్రీ నెంబర్ కోసం గూగుల్‌లో వెతకండి. అయితే ఆ సమయంలో తప్పనిసరిగా మీ అకౌంట్ నెంబర్, ఇటీవల కాలంలో జరిపిన లావాదేవీల వివరాలు మీ దగ్గర పెట్టుకొండి. ఎందుకంటే కస్టమర్ ప్రతినిధి ఈ వివరాలు అడుగుతారు.
2. నెట్ బ్యాంకింగ్
- నెట్ బ్యాంకింగ్ ఉపయోగించే వారు అకౌంట్లో లాగిన్ అవ్వాలి
- అందులో కార్డు లేదా సర్వీస్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి
- లాస్ట్ కార్డు (lost card) అనే ఆప్షన్‌కు వెళ్లి బ్లాక్ రిక్వెస్ట్‌పై క్లిక్ చేయాలి