తెలంగాణ

telangana

ETV Bharat / business

హోండా యాక్టివా EV స్కూటీ రెడీ- కిరాక్ లుక్, అదిరే ఫీచర్స్- రేంజ్ ఎంతంటే? - HONDA UNVEILS ACTIVA E

అదిరే ఫీచర్లతో యాక్టివా ఈ, QC 1 ఈవీ స్కూటర్స్​ - జనవరిలో బుకింగ్స్​, ఫిబ్రవరిలో డెలివరీ!

Honda ACTIVA e
Honda ACTIVA e (ETV Bharat (Representative Image))

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2024, 3:41 PM IST

Honda Unveils ACTIVA e : జపాన్​కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా మోటార్​ సైకిల్​ & స్కూటర్​ బుధవారం రెండు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించింది. అవి :

  1. యాక్టివా ఈ (Activa e)
  2. క్యూసీ 1 (QC 1)

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ద్వారా, భారత్​లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టూ-వీలర్​ మార్కెట్​ను క్యాష్ చేసుకోవాలని హోండా కంపెనీ భావిస్తోంది.

జనవరి నుంచే బుకింగ్స్​
హోండా కంపెనీ ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్స్​ను 2025 జనవరిలో ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరిలో డెలివరీ మొదలవుతుందని తెలిపింది. అయితే ఈ నయా ఈవీ స్కూటర్ల ధరలను మాత్రం వెల్లడించలేదు.

Honda QC 1 Features :హోండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్​ను ప్రత్యేకంగా భారత్​ మార్కెట్​ కోసమే రూపొందించింది. షార్ట్ డిస్టాన్స్​ (తక్కువ దూరం) ప్రయాణాలకు అనువుగా దీనిని తీర్చిదిద్దారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్​లో 1.5 కిలోవాట్​ సామర్థ్యం కలిగిన ఫిక్స్​డ్ బ్యాటరీ ఉంటుంది. ఈ స్కూటర్​పై 80 కి.మీ రేంజ్​ వరకు ప్రయాణించవచ్చు. దీని టాప్​ స్పీడ్​ 50 కి.మీ/గంట.

క్యూసీ 1లో 5-అంగుళాల ఎల్​సీడీ ఇన్​స్ట్రుమెంట్ ప్యానెల్​, సీట్​ కింద 26 లీటర్​ అండర్​-సీట్ స్టోరేజ్, యూఎస్​బీ టైప్​-సీ సాకెట్​ ఉంటాయి. ఈ స్కూటీ 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Honda Activa e Features :పెట్రోల్​తో నడిచే యాక్టివాకు, ఈ ఎలక్ట్రిక్ యాక్టివాకు ఎలాంటి పొంతన ఉండదు. ముఖ్యంగా ఈ ఈవీ స్కూటర్​ ముందు భాగాన్ని పూర్తిగా రీడిజైన్ చేశారు. ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​లను ఇరువైపులా అమర్చారు. అదనంగా ముందు భాగంలో ఎల్​ఈడీ డీఆర్​ఎల్​ను అమర్చారు.

ఈ హోండా యాక్టివా ఈ స్కూటీ రెండు 1.5 కిలోవాట్​ స్వాపబుల్ బ్యాటరీలతో వస్తుంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 102 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ స్కూటీ ఈకాన్, స్టాండర్డ్​, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్​ కలిగి ఉంటుంది. స్పోర్ట్​ మోడ్​లో ఈ బైక్​ గంటకు 80 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే ఇది కేవలం 7.3 సెకెన్లలోనే సున్నా నుంచి 60 కి.మీ/గంట వేగాన్ని అందుకుంటుంది.

ఈ యాక్టివా ఈ స్కూటర్​లో 7 అంగుళాల టీఎఫ్​టీ డిస్​ప్లే సహా అడ్వాన్స్​డ్​ ఫీచర్లు ఉన్నాయి. వీటిని హోండ్ రోడ్​సింక్​ డ్యూయో స్మార్ట్​ యాప్​తో అనుసంధానం చేసుకోవచ్చు. అంతేకాదు దీనిలో H-స్మార్ట్ కీ సిస్టమ్​ ఉంది. ఇది స్మార్ట్​ ఫైండ్​, స్మార్ట్ సేఫ్​, స్మార్ట్ అన్​లాక్​, స్మార్ట్ స్టార్​ ఫీచర్లు కలిగి ఉంటుంది. ఈ స్కూటీ కూడా 5 అందమైన రంగుల్లో లభిస్తుంది.

3 ఇయర్స్ వారెంటీ
ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లపై హోండా కంపెనీ 3 సంవత్సరాల లేదా 50,000 కి.మీ వరకు వారెంటీ ఇస్తుంది. అలాగే మొదటి ఏడాది మూడు సార్లు పూర్తి ఉచితంగా సర్వీస్ అందిస్తుంది.

కర్బన ఉద్గారాల తగ్గింపే లక్ష్యం!
"హోండా కంపెనీ యాక్టివా ఈ, క్యూసీ 1 అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత్​ మార్కెట్లోకి తెస్తుంది. అంతేకాదు మా కంపెనీ 2025 నాటికి కార్బన్​ న్యూట్రాలిటీ సాధించడానికి అనుగుణంగా పనిచేస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా వాహనాల ద్వారా విడుదలవుతున్న కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు 'ట్రిపుల్ యాక్షన్ టు జీరో' అనే భావనకు మా కంపెనీ కట్టుబడి ఉంది. ప్రధానంగా కార్బన్ న్యూట్రాలిటీ, క్లీన్ ఎనర్జీ, రిసోర్స్ సర్క్యులేషన్ అనే మూడు అంశాలపై మేము దృష్టి సారిస్తున్నాం" అని హోండా మోటార్ సైకిల్​ & స్కూటర్ ఇండియా, మేనేజింగ్ డైరెక్టర్​, ప్రెసిడెంట్​ & సీఈఓ సుట్సుము ఒటాని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details