Highest Paid CEOs In The Indian IT Sector :భారత ఐటీ రంగం నేడు అద్భుతమైన ప్రగతి సాధించి, దేశ ఆర్థిక వృద్ధిలో తనదైన పాత్ర పోషిస్తోంది. 1970లో చాలా చిన్నగా ప్రారంభమైన దేశీయ ఐటీ సంస్థలు నేడు అద్వితీయమైన ప్రగతి సాధించి, ప్రపంచ స్థాయిలో గొప్ప గుర్తింపును పొందాయి. నూతన సాంకేతిక ఆవిష్కరణలతో ఒక పవర్‌హౌస్‌గా పరిణామం చెంది, గ్లోబల్ ఐటీ కంపెనీలతో పోటీపడుతున్నాయి. ప్రధానంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఐటీ కన్సల్టింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి పలు రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్లకు సర్వీస్ అందిస్తున్నాయి.
కరోనా సంక్షోభం సమయంలో భారతీయ ఐటీ సంస్థలు క్లిష్టపరిస్థితులు ఎదుర్కొన్నాయి. కానీ సంక్షోభం ముగిసిన తరువాత అవి ఆకాశమే హద్దుగా తమ సర్వీస్‌లను అందిస్తూ, భారీ లాభాల్లోకి దూసుకుపోయాయి. దీనితో ఈ ఐటీ సంస్థల అధినేతలు (CEOలు) భారీగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. వారిలోని టాప్-6 హయ్యెస్ట్ పెయిడ్ ఐటీ కంపెనీ సీఈఓల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Top 6 Highest-Paid CEOs In Indian IT Sector :
1. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ సింగిశెట్టి :టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ సింగిశెట్టి గతేడాది ఏకంగా 22.53 మిలియన్ డాలర్స్ (రూ.186 కోట్లు) కంపెన్సేషన్‌గా పొందారు. అంటే ఒక రోజుకు రూ.51 లక్షలు చొప్పున సంపాదించారు. ఈ విధంగా భారతదేశంలోనే అత్యంత ఎక్కువ వేతనం పొందుతున్న ఐటీ కంపెనీ సీఈఓగా ఆయన నిలిచారు. కంపెనీ ఫైలింగ్ ప్రకారం, ఆయనకు కాగ్నిజెంట్ కంపెనీలో 20.25 మిలియన్ డాలర్స్ (సుమారుగా రూ.169.1 కోట్ల) విలువైన షేర్లు ఉన్నాయి. వీటిపై కూడా ఆయనకు ఆదాయం వస్తుంటుంది.
థియరీ డెలాపోర్ట్, విప్రో మాజీ సీఈఓ :విప్రో మాజీ సీఈఓ థియరీ డెలాపోర్ట్ 10.1 మిలియన్ డాలర్స్ (దాదాపు రూ.83 కోట్లు) వేతనంగా పొందారు. కంపెనీ మొత్తం రెవెన్యూ (11.16 బిలియన్ డాలర్ల)లో ఇది కేవలం 0.089 శాతం మాత్రమే కావడం గమనార్హం.