HDFC Bank Services Down :భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లను అలర్ట్ చేసింది. వినియోగదారులకు బ్యాంకింగ్ సర్వీసుల్లో అంతరాయం కలుగుతుందని ప్రకటించింది. ఈ మేరకు కస్టమర్లకు ఇ-మెయిల్స్ ద్వారా ముందుగానే సమాచారాన్ని ఇచ్చింది. దేశవ్యాప్తంగా 93మిలియన్ల మంది వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సిస్టమ్ అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొంది. జులై 13న శనివారం బ్యాంక్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు చెప్పింది. ఈ మొత్తం ప్రక్రియ శనివారం తెల్లవారుజామున 3 నుంచి సాయంత్రం 4.30 వరకు దాదాపు 13 గంటలకుపైనే కొనసాగుతుందని ప్రకటనలో తెలిపింది. "పెర్ఫామెన్స్ స్పీడ్, హై ట్రాఫిక్ మెయింటెయిన్ చేసేందుకు కెపాసిటీ పెంచడం కోసం బ్యాంక్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌ను(CBS) కొత్త ఇంజనీరింగ్ ప్లాట్‌ఫారమ్‌కు బదిలీ చేస్తున్నాం. కస్టమర్లకు అసౌకర్యాన్ని తగ్గించడానికి సెలవు రోజు అప్‌గ్రేడ్ చేస్తున్నప్పటికీ కొంత ఇబ్బంది ఎదుర్కోక తప్పదు. ఆన్‌లైన్ సేవలు చేసుకోవాలనుకునేవారు ముందుగా ప్లాన్ చేసుకోవాలి." అని సూచించింది. ఈ నేపధ్యంలోనే అందుబాటులో ఉండే సేవలు ఏంటో ఒకసారి చూద్దాం
నగదు ఉపసంహరణ
డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ సేవలు : HDFC డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డుల్ని ఉపయోగించి నిర్ణీత పరిమితి మేరకు ఏటీఎంల్లో క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు.
స్టోర్‌లో: స్వైప్ మెషీన్‌లపై పరిమిత లావాదేవీలకు అవకాశం ఉంది. అయితే వీటికి సంబంధించిన అలర్ట్‌లు మాత్రం తరువాత రోజుకే అందుతాయి.