GPay Transaction History Delete :దేశంలో కొన్నేళ్లుగా డిజిటల్ పేమెంట్స్ బాగా పెరిగిపోయాయి. ప్రతిదానికీ యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో చిన్నచిన్న షాపులు మొదలు, పెద్ద స్థాయిలో నిర్వహించే వ్యాపారాల వరకూ, యూపీఐ పేమెంట్స్‌ను సర్వసాధారణం అయిపోయాయి. మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ యాప్‌ల్లో 'గూగుల్ పే' ఒకటిగా ఉంది. కూరగాయలు కొనడం నుంచి రైలు, విమాన టికెట్ బుకింగ్‌ల వరకు ఈ యాప్‌నే చాలా మంది వినియోగిస్తున్నారు. మనం చేసే ప్రతి చెల్లింపునకు సంబంధించిన వివరాలు ఆ యాప్‌లో నమోదవుతుంది. అయితే ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఆ వివరాలను కనిపించకుండా చేసేందుకు సదుపాయమూ ఉంది. కింద పేర్కొన్న విధంగా చేస్తే గూగుల్ పే హిస్టరీను డిలీట్ చేయవచ్చు.
ఎలా డిలీట్ చేయాలంటే!
- గూగుల్ పే యాప్‌లో ప్రొఫైల్‌పై ట్యాప్ చేసి 'Settings'లోకి వెళ్లాలి. అక్కడ 'Privacy & Security' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అందులో 'Data & Personalization' అనే ఆప్షన్‌ను ఎంచుకొని గూగుల్ అకౌంట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత 'Manage your Google pay experience' పేజ్‌ని కిందకు స్క్రోల్ చేస్తే గూగుల్ పే లావాదేవీల హిస్టరీ కనిపిస్తుంది.
- ఆ జాబితాలో మీరు తొలగించాలనుకున్న లావాదేవీని అక్కడి ఆప్షన్‌తో డిలీట్ చేయొచ్చు.
- కావాలంటే టైమ్ ఫ్రేమ్‌ను ఎంచుకొని ఆ డేటా మొత్తాన్నీ తొలగించొచ్చు. మొత్తం హిస్టరీని కూడా డిలీట్ చేయొచ్చు.