తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫ్లిప్​కార్ట్​ 'బిగ్‌ సేవింగ్‌ డేస్‌' సేల్‌ - భారీ ఆఫర్స్​ & డీల్స్​ - ఎప్పటి నుంచి అంటే? - Flipkart Big Saving Days 2024 - FLIPKART BIG SAVING DAYS 2024

Flipkart Big Saving Days 2024 : ఆన్​లైన్ షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్​. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ తేదీలను ప్రకటించింది. ఈ సేల్​లో పలు ప్రొడక్టులపై భారీ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అందించనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలు మీ కోసం.

FLIPKART OFFERS 2024
Flipkart Big Saving Days 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 10:57 AM IST

Updated : Apr 27, 2024, 11:49 AM IST

Flipkart Big Saving Days 2024 :ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌' ప్రారంభించనున్నట్లు పేర్కొంది. మే 3 నుంచి 9వ తేదీ వరకు ఈ సేల్‌ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే గృహోపకరణాలపై భారీ ఆఫర్స్ అండ్​ డీల్స్ లభిస్తాయని పేర్కొంది.

వారికి ఒక్కరోజు ముందుగానే!
ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్‌షిప్‌ కలిగిన యూజర్లకు ఒకరోజు ముందుగానే, అంటే మే 2 నుంచే ఈ సేల్‌ అందుబాటులో ఉంటుందని ప్లిప్​కార్ట్​ వెల్లడించింది.

ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్

  • ఫ్లిప్​కార్ట్​ బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్​లో ఎస్‌బీఐ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్ అందించనున్నారు.
  • ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ఆప్షన్‌ ద్వారా రూ.1,00,000 వరకు కొనుగోలు చేయవచ్చు. వీటిపై నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా కల్పించనున్నారు.
  • యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ అందిస్తారు.
  • యూపీఐ పేమెంట్స్​పై కూడా డిస్కౌంట్స్ అందిస్తారు.​
  • వాస్తవానికి ఫ్లిప్​కార్ట్​ ఇంకా పలు ప్రొడక్టులపై అందించే ఆఫర్లను ప్రకటించలేదు. త్వరలోనే వాటిని రివీల్ చేసే అవకాశం ఉంది.
  • కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్లు అందించనున్నట్లు సమాచారం.

ఫ్లిప్​కార్ట్​ VIP ప్రోగ్రామ్​
ఫ్లిప్​కార్డ్ ప్లస్ ప్రీమియం మెంబర్​షిప్​తో పాటు, ఫ్లిప్​కార్ట్​ వీఐపీ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఈ వీఐపీ మెంబర్​షిప్​ ధర రూ.499. దీని వ్యాలిడిటీ ఒక సంవత్సరం. ఈ వీఐపీ సబ్​స్క్రిప్షన్ తీసుకున్న ఫ్లిప్​కార్ట్ యూజర్లకు పలు బెనిఫిట్స్ లభిస్తాయి. అవి ఏమిటంటే?

1. ప్రతి ఆర్డర్​పై 5 శాతం వరకు లేదా 10 సూపర్ కాయిన్స్​ వరకు సంపాదించవచ్చు. రూ.10,000 కంటే ఎక్కువ విలువైన ఆర్డర్​లపై 200 సూపర్ కాయిన్స్ బోనస్​గా పొందవచ్చు.

2. రూ.1000 విలువైన అన్ని ప్రొడక్టులపై 5 శాతం వరకు ఎక్స్​ట్రా సేవింగ్స్ పొందవచ్చు.

3. మిగతా యూజర్ల కంటే, వీఐపీ సబ్​స్క్రైబర్లకు ముందుగానే సేల్​ యాక్సెస్ లభిస్తుంది.

4. ఆర్డర్ చేసిన 48 గంటల్లోనే పూర్తి ఉచితంగా డెలివరీ చేస్తారు. మీరు ప్రొడక్ట్​ వద్దనుకుంటే, దానిని త్వరగా రిటర్న్​ చేసే ఫెసిలిటీ కల్పిస్తారు.

5. ప్రయారిటీ కస్టమర్ సపోర్ట్ కూడా లభిస్తుంది. అంటే వెయిటింగ్ టైమ్ అనేది ఉండదు. డెడికేటెడ్ ఏజెంట్ డెస్క్​ మీకు సహాయం చేస్తుంది.

6. వీఐపీ సబ్​స్క్రైబర్లకు వెల్​కమ్ బాక్స్​ కూడా ఇస్తారు. ఇంకా బోలెడ్ ప్రయోజనాలు కూడా అందిస్తారు.

అపర కుబేరుడు ఎలాన్​ మస్క్ జీవితాన్ని మార్చిన టాప్​-10 బుక్స్ ఇవే! - Elon Musk Recommended Books

మొదటిసారి కారు కొంటున్నారా? ఈ టాప్​-10 ఫీచర్స్​ మస్ట్​! - Car Buying Guide

Last Updated : Apr 27, 2024, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details