FASTag KYC Update Last Date : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ETC) వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేందుకు 'వన్ వెహికల్, వన్ ఫాస్టాగ్' విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్‌ను తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా వాహనదారులు అందరూ తమ ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియను జనవరి 31లోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఒక వేళ గడువులోగా ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే, జనవరి 31 తరువాత సదరు ఫాస్టాగ్ అకౌంట్‌ను బ్లాక్ అవుతుందని పేర్కొంది.
బ్యాలెన్స్ ఉన్నప్పటీ
ఫాస్టాగ్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే సదరు అకౌంట్లను జనవరి 31 తరువాత డీయాక్టివేషన్ లేదా బ్లాక్ చేస్తామని NHAI తెలిపింది. దేశంలో దాదాపు 7 కోట్ల ఫాస్టాగ్ అకౌంట్లు ఉన్నాయి. అయితే వాటిలో 4 కోట్ల అకౌంట్లు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. పైగా వీటిలో 1.2 కోట్ల ఫాస్టాగ్‌లు నకిలీవని తేలింది. అందుకే ఈ సమస్యను నివారించేందుకు NHAI నూతన కేవైసీ పాలసీని ప్రవేశపెట్టింది.
FASTag KYC Update FAQs And Answers
ఫాస్టాగ్ కేవైసీ పూర్తి అయిందో లేదో ఎలా తెలుస్తుంది?
ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ తెలుసుకోవాలంటే మీ ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ లేదా మీ బ్యాంక్ యాప్‌లకు వచ్చిన నోటిఫికేషన్‌లను చెక్ చేయండి. ఈ నోటిఫికేషన్‌లు మీ ఫాస్టాగ్ కేవైసీ పూర్తికాకపోతే మిమ్మల్ని హెచ్చరిస్తాయి. అప్పుడు మీరు వెంటనే ఆన్లైన్లో ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి.
ఒక వేళ మీ ఈ-మెయిల్, బ్యాంకు యాప్‌లకు ఫాస్టాగ్‌కు సంబంధించిన ఎలాంటి నోటిఫికేషన్ రాలేదంటే, మీ ఫాస్టాగ్ కేవైసీ పూర్తి అయ్యిందని అర్థం చేసుకోవచ్చు. కనుక మీరు కంగారు పడకుండా నిశ్చింతగా ఉండవచ్చు.
ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
మీరు మీ ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ చెక్ చేసుకునేందుకు https://fastag.ihmcl.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. మీ వివరాలను నమోదు చేసి, పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. అక్కడ మీకు మీ ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ కనిపిస్తుంది. ఒకవేళ అది ఇన్కంప్లీట్గా ఉంటే, అక్కడే కేవైసీని అప్డేట్ కూడా చేసుకోవచ్చు.