EV Scooters Without Driving Licence :భారతదేశంలో టూ-వీలర్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్త్రీ, పురుషులు; చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టూ-వీలర్స్ నడపడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వీటితో మెయిన్ రోడ్లపైనే కాదు, చిన్నచిన్న సందుల్లోనూ చాలా సులువుగా వెళ్లిపోవచ్చు. కానీ వీటిని డ్రైవ్ చేయాలంటే కచ్చితంగా లైసెన్స్ ఉండాలి. ఎందుకంటే భారత్‌లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టవిరుద్ధం. అయితే డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా నడపగలిగే కొన్ని ఎలక్ట్రికల్ స్కూటర్లు ఉన్నాయి.
ఈ ఈవీ స్కూటర్లు తక్కువ ధరకే లభిస్తాయి. పైగా మెయింటెనెన్స్ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందుకే వీటికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఈ ఈవీ స్కూటర్ల గరిష్ఠ వేగం గంటకు 25 కి.మీ వరకు ఉంటుంది. కనుక వీటిని డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా నడుపుకోవచ్చు. మరి మీకు కూడా ఇలాంటి స్కూటర్ కొనాలని ఆశగా ఉందా? మరెందుకు ఆలస్యం భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని టాప్-7 ఈవీ స్కూటర్లపై ఓ లుక్కేద్దాం రండి.
1. Komaki XGT KM : కొమాకి ఎక్స్‌జీటీ కేఎం అనేది ఒక ఫ్యామిలీ స్కూటర్. దీనిలో ట్యూబ్‌లెస్ టైర్స్, డిస్క్ బ్రేక్ ఫీచర్స్ ఉన్నాయి. దీనిలో డిజిటల్ డిస్ప్లే సిస్టమ్ ఉంది. కనుక ఈ స్కూటీ చూడడానికి చాలా స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపిస్తుంది. స్కూటర్లో 20-30Ah లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 85 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు. మార్కెట్లో ఈ కొమాకి ఎక్స్‌జీటీ కేఎం స్కూటర్ ధర సుమారుగా రూ.56,890 నుంచి రూ.93,045 (ఎక్స్-షోరూం ధర) ఉంటుంది.
2. Okinawa R30 :ఈ ఒకినావా ఆర్30 స్కూటర్లో 1.25kWh లిథియం ఐయాన్ బ్యాటరీ ఉంటుంది. దీనికి మూడేళ్ల వారెంటీ ఇస్తారు. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి 4-5 గంటలు పడుతుంది. దీని డ్రైవింగ్ రేంజ్ 60 కి.మీ ఉంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 25 కి.మీ. ఈ స్కూటర్ 5 కలర్ వేరియంట్లలో లభిస్తుంది. దీనికి ముందు వెనుక భాగాల్లో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. మార్కెట్లో ఈ బైక్ ధర సుమారుగా రూ.61,998 (ఎక్స్-షోరూం ధర) ఉంటుంది.
3. Hero Electric Flash :ఈ హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ స్కూటర్లో 250 వాట్ BLDC హబ్ మోటార్ ఉంది. దీనితో గరిష్ఠంగా గంటకు 25 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. దీనిలో 28Ah లెడ్-అసిటేట్ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 50 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు. ఇది రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో ఈ స్కూటర్ ధర సుమారుగా రూ.59,640 (ఎక్స్-షోరూం ధర) వరకు ఉంటుంది.