తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆండ్రాయిడ్, ఐఫోన్, ల్యాప్​టాప్​, ఇయర్​బడ్స్​ - ఇక అన్నింటికీ ఒకే ఛార్జర్! - EU COMMON CHARGER LAW

యూరోపియెన్ యూనియన్ నయా రూల్​ - ఇక ఐఫోన్, ల్యాప్​టాప్​, ఇయర్​బడ్స్​​ అన్నింటికీ ఒకే ఛార్జర్!

EU New Law For Chargers
EU New Law For Chargers (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2024, 3:12 PM IST

Updated : Dec 31, 2024, 3:40 PM IST

EU New Law For Chargers : స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ వాచెస్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో చాలా మందికి ఎదురయ్యేది ఛార్జింగ్ సమస్య. ఇంటి నుంచి ఆఫీసుకు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు సొంత ఛార్జర్ తీసుకెళ్లకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ గాడ్జెట్​కు సరిపోయే కేబుల్ వేరేవాళ్ల దగ్గర దొరక్కపోతే ఇబ్బంది పడతారు. అలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు యూరోపియన్ యూనియన్ ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. అది తాజాగా అమల్లోకి వచ్చింది.

ఇకపై టైప్‌-సి పోర్ట్‌ మాత్రమే
మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లు ఇలా ఏ డివైజ్​కు అయినా యూఎస్​బీ టైప్‌-సి పోర్ట్‌ ఉండే ఛార్జర్‌ మాత్రమే ఉండాలని యూరోపియన్‌ పార్లమెంట్‌ ఓ చట్టాన్ని కొన్నాళ్ల క్రితం తీసుకొచ్చింది. ఈ ఏడాది డిసెంబరు 28 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీంతో యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఏ డివైజ్ కొనుగోలు చేసినా యూఎస్​బీ టైప్-సి ఛార్జర్​నే ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ నిర్ణయం త్వరలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

ఈయూలో అమలు
ఈ ఏడాది డిసెంబర్ 28 నుంచి మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు, డిజిటల్ కెమెరాలు, హెడ్‌ ఫోన్లు, హెడ్‌ సెట్లు, వీడియో గేమ్ కన్సోల్స్, పోర్టబుల్ స్పీకర్లు, ఈ-రీడర్లు, కీబోర్డు, మౌస్, పోర్టబుల్ నావిగేషన్ సిస్టమ్‌ ఇలాంటి అన్ని ఎలక్ట్రానిక్ డివైజ్​లకు యూఎస్​బీ టైప్-సి ఛార్జర్​నే అందిస్తున్నారు. ఈయూలో అమ్మకాలు జరిపే ఏ కంపెనీ అయినా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్​కు తప్పనిసరిగా యూఎస్​బీ టైప్-సి ఛార్జర్​ను ఇవ్వాలి. లేదంటే ఈయూలో అమ్మకాలు జరపడానికి అనుమతి లేదు. ఈ-వేస్ట్​ను తగ్గించడం, వినియోగదారులకు సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఈయూ ఈ నిర్ణయం తీసుకుంది.

యాపిల్​కు దెబ్బ!
అయితే ఈయూ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పోటీ కంపెనీలతో పోలిస్తే యాపిల్​పై తీవ్ర ప్రభావం పడనుంది. ఆ కంపెనీ ప్రస్తుతం తమ స్మార్ట్‌ ఫోన్లకు లైటెనింగ్‌ పోర్ట్​ను వినియోగిస్తోంది. తొలుత అన్ని డివైజ్​లకు యూఎస్​బీ టైప్-సి పోర్ట్ ఉండాలన్న ఈయూ నిర్ణయాన్ని యాపిల్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ తర్వాత లైటెనింగ్‌ పోర్ట్‌ స్థానంలో యూఎస్​బీ టైప్‌-సి పోర్ట్​ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. యాపిల్‌ ఐఫోన్‌ 14 తర్వాత విడుదల చేసిన మోడళ్లలో టైప్‌-సి పోర్ట్​ను తీసుకొచ్చింది. దాంతో ఐఫోన్‌ 15తోపాటు తదుపరి మోడళ్లకు ఈ సమస్య లేదు.

ఈయూ అన్ని మొబైళ్లలో ప్రామాణికంగా యూఎస్​బీ టైప్‌-సి పోర్ట్‌ తో ఉన్న ఛార్జింగ్‌ సదుపాయం ఉండాలనేలా నిబంధనలు తీసుకొచ్చింది. కానీ ప్రస్తుతం అధికారికంగా వాడుకలో ఉన్న ఐఫోన్‌ 14, ఐఫోన్‌ ఎస్‌ఈ ఫోన్లలో ప్రత్యేకంగా యాపిల్‌ ఛార్జింగ్‌ పోర్ట్‌ ఉంటుంది. ఇది యూరప్‌ నిబంధనలకు విరుద్ధం. దాంతో స్థానికంగా ఈ మోడళ్ల అమ్మకాలను యాపిల్ నిలిపివేయాల్సి వచ్చింది.

ఈయూ నిర్ణయం వల్ల లాభాలు
బ్రాండ్​తో సంబంధం లేకుండా అన్ని డివైజ్​లు యూఎస్ బీ టైప్-సి పోర్ట్​తో ఛార్జ్ అవుతాయి. దీంతో వినియోగదారుడికి సౌలభ్యంగా ఉంటుంది. అలాగే వినియోగదారుడికి డబ్బులు పొదుపు అవుతాయి. అంతేకాకుండా ఈ-వ్యర్థాలు తగ్గుతాయి. దీంతో పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది.

బస్సులు, రైల్వే స్టేషన్లలో మొబైల్ ఛార్జ్ చేస్తున్నారా? మీ ప్రైవేట్ డేటా లీక్ అయ్యే ఛాన్స్!

Iphone 15 Battery Life Charging Speed : ఐఫోన్​ 15 సిరీస్​ బ్యాటరీ లైఫ్​, ఛార్జింగ్​ స్పీడ్​పై టెక్​ లవర్స్​ అసంతృప్తి!..

Last Updated : Dec 31, 2024, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details