Elon Musk Announcement :టెస్లా, ఎక్స్ (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పారు. 2500+ సబ్‌స్క్రైబర్స్‌ను కలిగి ఉన్న ఎక్స్ క్రియేటర్స్ ఇక నుంచి ప్రీమియం ఫీచర్స్‌ను ఉచితంగానే ఉపయోగించుకోవచ్చని వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. దీని ప్రకారం 2500 కంటే ఎక్కువ మంది వెరిఫైడ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఎక్స్ క్రియేటర్లు ఎటువంటి ఫీజులు చెల్లించకుండానే ఈ ప్రీమియం ఫీచర్స్‌ను వాడుకోవచ్చు. అంతేకాకుండా 5వేలకుపైగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న యూజర్స్‌కు ప్రీమియం+ ఫీచర్స్‌ను ఫ్రీగా అందిచనున్నట్లు ప్రకటించారు.
అధిక సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు కలిగిన ఎక్స్ వినియోగదారులు మంచి కంటెంట్‌ను తమ ఖాతాల్లో అందించే విధంగా ఈ తాజా ప్రకటన దోహదం చేస్తుందని టెక్ నిపుణులు అంటున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించేందుకే ఎలాన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఎక్స్‌లో విస్తృతమైన ప్రీమియం, ప్రీమియం+ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని వాడాలనుకునే క్రియేటర్స్ ఇంతకుముందు సంస్థ నిర్దేశించిన కొంత రుసుమును చెల్లించి వినియోగించుకోవాల్సి వచ్చేది.
ప్రీమియం ఫీచర్స్ వివరాలివీ!
- ఈ ప్రీమియం టూల్స్‌ను ఎక్స్ క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్లు, యూజర్లు కంటెంట్ క్రియేషన్, మానిటైజేషన్ కోసమే కాకుండా మెరుగైన కమ్యునికేషన్ కోసం కూడా వాడతారు.
- ఎక్స్‌లోని ప్రీమియం టైర్ ఫీచర్ ఎడిట్ పోస్ట్ లాంటి వెసులుబాటును కల్పిస్తుంది. ఈ ఫీచర్ సాయంతో తాము అప్లోడ్ చేసిన కంటెంట్‌ను ఎడిట్ చేయాలనుకునే క్రియేటర్లు గంటలోపే దానిలో పరిమితంగా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఈ ఫీచర్ల ద్వారా సబ్స్క్రైబర్లు ట్రెడిష్నల్ క్యారెక్టర్ లిమిట్‌ను పెంచుకోవచ్చు. 25,000 క్యారెక్టర్లతో కూడిన సుదీర్ఘ పోస్టును క్రియేట్ చేసుకోవచ్చు. వివరణాత్మకమైన కంటెంట్‌ను యూజర్స్‌కు అందించేందుకు వీలుగా ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
- ప్రీమియం యూజర్లు సుదీర్ఘమైన వీడియోలను అప్లోడ్ చేసేందుకు ఈ ఫీచర్లు ఉపయోగపడతాయి. దాదాపు మూడు గంటల వ్యవధి, 8GB సైజ్ కలిగిన కంటెంట్‌ను పోస్ట్ చేయవచ్చు.
- ప్రీమియం సబ్స్క్రైబర్లు ఎక్స్‌లో ప్రత్యేక కమ్యునిటీలను క్రియేట్ చేసుకునే అధికారాన్ని కలిగి ఉంటారు. ఒకేవిధమైన ఆలోచనలు, వైఖరిని కలిగిన వ్యక్తులను వీరు తమ కమ్యునిటీలో జాయిన్ చేసుకోవచ్చు.
- ఇవే కాకుండా బ్లూ చెక్‌మార్క్ వెరిఫికేషన్, అథెంటిసిటీ సైనిఫైయింగ్, క్రెడిబిలిటీ సహా మరెన్నో ప్రత్యేక ప్రయోజనాలను ఈ ప్రీమియం, ప్రీమియం+ ఫీచర్స్ ద్వారా పొందవచ్చు.
యూట్యూబ్‌కు పోటీగా X వీడియోస్ - నో సెన్సార్ - వారికి మాత్రమే ప్రత్యేకం!
గుడ్ న్యూస్ - 'X' ప్రీమియం యూజర్లకు త్వరలోనే 'గ్రోక్' ఏఐ యాక్సెస్! - Grok AI For All X Premium Users