Easy Tests to Check Purity of Gold : అక్షయ తృతీయ ఈ ఏడాది మే 10న వస్తోంది. ఈ పర్వదినాన మీరు బంగారం కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా? అయితే.. బంగారాన్ని(Gold)కొనే ముందు దాని స్వచ్ఛతను తెలుసుకోవడం చాలా అవసరం. ఇందుకోసం నిపుణులు కొన్ని సింపుల్ టెక్నిక్స్ సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హాల్‌మార్క్ లోగో :మీరు బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే.. బీఐఎస్ హాల్ మార్క్ గుర్తు కలిగిన నగలను మాత్రమే కొనుగోలు చేయాలి. ఎందుకంటే హాల్‌మార్క్ గుర్తు స్వచ్ఛమైన బంగారానికి భరోసా ఇస్తుంది. ఈ గుర్తును బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) జారీ చేస్తోంది. అన్ని బంగారు నగలపై ఇది కనిపిస్తుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.
గోల్డ్ క్యారెట్స్ : పసిడి స్వచ్ఛతను సాధారణంగా క్యారెట్లలో కొలుస్తారు. దీనిని k లేగా kt తో సూచిస్తారు. అత్యంత స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్లు ఉంటుంది. అంటే దీంట్లో 99.9 శాతం గోల్డ్ ఉండి చాలా మృదుగా ఉంటుంది. అందుకే ఆభరణాల తయారీకి ఇతర లోహాలను యాడ్ చేస్తుంటారు. ఉదాహరణకు మీరు తీసుకున్న బంగారం 18k అనుకుంటే అందులో 18 భాగాలు గోల్డ్ ఉండి, ఇతర లోహాలు 6 భాగాలుంటాయి. అంటే.. ఇలాంటి నగలలో 75 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
యాసిడ్ టెస్ట్ :మీరు తీసుకున్న బంగారం స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవడానికి అత్యంత నమ్మకమైన పద్ధతులలో యాసిడ్ టెస్ట్ ఒకటని చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా నైట్రిక్ యాసిడ్, ఒక రాయిని తీసుకోవాలి. ఆపై గోల్డ్‌ను రాయిపై రుద్దాలి. ఆ తర్వాత దానిపై నైట్రిక్ యాసిడ్ పోయాలి. అప్పుడు మీరు తీసుకున్న గోల్డ్‌లో మరేదైనా లోహం ఉంటే యాసిడ్ దానిని కరిగిస్తుందంటున్నారు నిపుణులు.
అక్షయ తృతీయ రోజున బంగారం కొనడానికి శుభసమయం ఏది? - మీకు తెలుసా? - Akshaya Tritiya 2024