తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫస్ట్-పార్టీ ఇన్సూరెన్స్ Vs థర్డ్​-పార్టీ కార్​ ఇన్సూరెన్స్​ - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్​! - Car Insurance

First-Party Insurance Vs Third-party Car Insurance : మీరు మొదటిసారిగా కారు కొనాలని అనుకుంటున్నారా? ఫస్ట్-పార్టీ ఇన్సూరెన్స్​, థర్డ్​-పార్టీ ఇన్సూరెన్స్​ మధ్య తేడా తెలియక కన్ఫ్యూజ్​ అవుతున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ రెండు కారు బీమా పథకాల మధ్య ఉన్న ప్రధానమైన బేధాలు ఏమిటి? ఏది బెస్ట్ ఆప్షన్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.

vehicle insurance importance
car insurance importance (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 8, 2024, 4:57 PM IST

First-Party Insurance Vs Third-party Car Insurance : కారు కొనాలని అనుకునేవాళ్లు కచ్చితంగా ఫస్ట్-​పార్టీ ఇన్సూరెన్స్, థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ వెహికల్ ఇన్సూరెన్స్​లు ప్రమాదాలు జరిగినప్పుడు లేదా నష్టం సంభవించినప్పుడు పాలసీదారులకు ఆర్థిక రక్షణ కల్పిస్తాయి. అయితే వీటి పరిధి, ప్రయోజనాలు, ప్రీమియంలు చాలా భిన్నంగా ఉంటాయి. అందుకే ఈ రెండు రకాల బీమా పథకాల గురించి ప్రతి కారు ఓనర్​ కచ్చితంగా తెలుసుకోవాలి.

What Is Car Insurance?
ప్రమాదం, దొంగతనం, నష్టం (డ్యామేజ్) జరిగినప్పుడు పాలసీదారుకు ఆర్థిక రక్షణ కల్పించేదే కారు ఇన్సూరెన్స్. ఈ బీమా పాలసీల్లో ప్రధానంగా మూడు పార్టీలవారు ఉంటారు. వారు ఎవరంటే?

1. ఫస్ట్​ పార్టీ :వెహికల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసిన వ్యక్తినే 'ఫస్ట్ పార్టీ' అని అంటారు. సాధారణంగా వాహనం కొనుగోలు చేసిన వ్యక్తులే, బీమా పాలసీ కూడా తీసుకుంటారు. కనుక ఈ ఫస్ట్​ పార్టీ వారే బీమా పాలసీ ప్రీమియం చెల్లిస్తారు. అవసరమైనప్పుడు క్లెయిమ్ చేసుకుని, పరిహారం పొందుతారు.

2. సెకెండ్ పార్టీ :ఇన్సూరెన్స్ కంపెనీని సెకెండ్ పార్టీగా పేర్కొంటారు. పాలసీదారు నుంచి ప్రీమియం తీసుకుని ఈ బీమా కంపెనీలు వెహికల్ ఇన్సూరెన్స్​ను అందిస్తూ ఉంటాయి. ఒకవేళ పాలసీదారుని వాహనానికి ఏదైనా డ్యామెజ్ జరిగితే, దానికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీకి ఉంటుంది.

3. థర్డ్ పార్టీ : ఫస్ట్ పార్టీ, సెకెండ్ పార్టీ వారు కాకుండా, వాహన ప్రమాదంలో నష్టపోయిన ఇతరులను థర్డ్ పార్టీ అంటారు.

Primary Insurance Categories
వాహన బీమాలో రెండు ప్రాథమిక కేటగిరీలు ఉంటాయి. అవి: ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్​. వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

First-Party Car Insurance : ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్​నే 'కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్' అని కూడా అంటారు. ఇది ప్రమాదానికి గురైన వాహనానికి, అందులో ఉన్నవారికి జరిగిన నష్టాన్ని కవర్ చేస్తుంది.

  • వాహనాలు పరస్పరం ఢీకొనప్పుడు జరిగిన నష్టానికి ఫస్ట్-పార్టీ ఇన్సూరెన్స్​ పరిహారం అందిస్తుంది.
  • వాహనం దొంగతనానికి గురైనా, విధ్యంసంలో పాడైపోయినా, ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్నా పరిహారం అందిస్తుంది.
  • ప్రమాదానికి గురైన డ్రైవర్​కు వైద్య ఖర్చులను కూడా చెల్లిస్తుంది. దీని వల్ల పాలసీదారునికి ఆర్థిక రక్షణ లభిస్తుంది.
  • ఫస్ట్-పార్టీ ఇన్సూరెన్స్​లో రోడ్​సైడ్​ అసిస్టెన్స్​, రెంటల్ కార్ రీయింబర్స్​మెంట్​, జీరో డిప్రిసియేషన్, ఇంజన్ ప్రొటెక్షన్​, ఇన్​వాయిస్ రిటర్న్​, ఎన్​సీబీ ప్రొటెక్షన్​ ఉంటాయి. అంతేకాదు వాహనంలో ఉన్న వ్యక్తిగత వస్తువులకు కూడా కవరేజ్​ పొందవచ్చు. అయితే ఈ అదనపు ప్రయోజనాల కోసం కాస్త ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
  • విస్తృతమైన కవరేజ్​ ఉండడం వల్ల థర్డ్-పార్టీ బీమాతో పోలిస్తే ఈ ఫస్ట్​-పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.
  • వాస్తవానికి ఈ ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఒక ఆప్షనల్​. కనుక వాహనదారులు తమ బడ్జెట్​కు, అవసరాలకు అనుగుణంగా ఈ కాంప్రిహెన్సివ్​ ఇన్యూరెన్స్​ను తీసుకోవాల్సి ఉంటుంది.

Third-Party Car Insurance :ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్​ను 'లయబిలిటీ ఇన్సూరెన్స్' అని కూడా అంటారు.

  • భారతదేశంలో వాహనం రిజిస్టర్ చేయాలన్నా, దానిని రోడ్లపై నడపాలన్నా కచ్చితంగా థర్డ్​-పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే.
  • వాహనాన్ని నడిపే వ్యక్తివల్ల ప్రమాదానికి గురైన థర్డ్ పార్టీ వ్యక్తులకు ఈ పాలసీ కింద​ పరిహారం లభిస్తుంది.
  • వాహన ప్రమాదం జరిగినప్పుడు, పాలసీదారునకు ఫస్ట్​-పార్టీ ఇన్సూరెన్స్ వల్ల పరిహారం లభిస్తుంది. కానీ సదరు పాలసీదారు వల్ల జరిగిన యాక్సిడెంట్​లో గాయపడిన వారికి, ఆర్థికంగా నష్టపోయిన వారికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా పరిహారం అందుతుంది.
  • ప్రమాదం వల్ల నష్టపోయిన వాళ్లు కోర్టులో దావా వేస్తే, అందుకు అయ్యే చట్టపరమైన ఖర్చులను (లీగల్​ ఫీజులను) కూడా అందిస్తుంది.
  • ఫస్ట్-పార్టీ ఇన్సూరెన్స్​తో పోలిస్తే, థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ అనేది పరిమితమైన కవరేజ్​ను అందిస్తుంది.

బెస్ట్ స్కీమ్​ - రోజుకు రూ.13 కడితే చాలు - జీవితాంతం నెలకు రూ.5000 పెన్షన్! - Atal Pension Yojana

మంచి​ ఎలక్ట్రిక్ కార్ కొనాలా? లాంగెస్ట్ రేంజ్ కలిగిన టాప్​-5 మోడల్స్ ఇవే! - Top Range Electric Cars

ABOUT THE AUTHOR

...view details