Consumer Rights in General Insurance :జీవిత బీమాయేతర పాలసీలను జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలుగా పరిగణిస్తారు. వాహన, మెడిక్లెయిమ్, హోమ్, ట్రావెల్ తదితర అంశాలకు సంబంధించిన బీమా పాలసీలు ఈ విభాగంలోకి వస్తాయి. పాలసీ తీసుకున్న వ్యక్తి నిర్దిష్ట పరిణామం వల్ల నష్టపోయిన పక్షంలో పరిహారం పొందేందుకు ఈ పాలసీలు ఉపయోగపడతాయి. జనరల్ ఇన్సూరెన్స్ తీసుకునే వినియోగదారులకు రక్షణ కల్పించడానికి, మెరుగైన సేవలు అందించడానికి ఇటీవల కాలంలో కొత్త చట్టాలు వచ్చాయి. అందులో బీమా పాలసీ తీసుకున్న వారికి ఎక్కువ రక్షణ కల్పించడంపై దృష్టి సారించారు.
1. పారదర్శకత
పాలసీకి సంబంధించిన అన్ని నిబంధనలు, షరతులు, మినహాయింపులను బీమా సంస్థలు వినియోగదారులకు అందించాలని రెగ్యులేటరీ అధికారులు కఠినమైన నిబంధనలు విధించారు. ఈ చర్య వల్ల జనరల్ ఇన్సూరెన్స్ పై వినియోగదారులకు పారదర్శతక పెరుగుతుంది. కాగా, ఈ చర్య వల్ల చాలా ఫిర్యాదులు అందాయి.
2. కంప్లైంట్స్కు ఫ్లాట్ ఫారమ్
కొన్నిసార్లు కస్టమర్ల ఫిర్యాదులను స్వీకరించపోయినా, వారి కంప్లైంట్‌పై సరైన చర్యలు తీసుకోకపోయినా వినియోగదారుడు అసంతృప్తికి గురవుతాడు. జనరల్ ఇన్సూరెన్స్ ఫిర్యాదుల యంత్రాంగాన్ని మెరుగుపరచడంపై చట్టపరమైన సంస్కరణలు దృష్టి సారించాయి. ప్రతి బీమా సంస్థ తప్పనిసరిగా హాట్ లైన్స్, వెబ్ ఆధారిత ఫిర్యాదు ఫోరమ్స్ వంటి కస్టమర్ సేవా ప్లాట్ ఫారమ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించాయి. కస్టమర్ల ఫిర్యాదులపై మరింత వేగంగా ప్రతిస్పందించాలని కోరాయి. అంబుడ్స్ మెన్ సేవలను కూడా మెరుగుపర్చారు.
3. కస్టమర్ల కోసం
ప్రస్తుత కాలంలో చట్టబద్ధమైన క్లెయిమ్‌లను చెల్లించడానికి కొన్ని బీమా సంస్థలు నిరాకరిస్తున్నాయి. ఇలా చేస్తే బీమా కంపెనీలపై కొత్త నిబంధనల ప్రకారం జరిమానా పడుతుంది. దీంతో నైతికంగా విక్రయాలను జరపడం, కస్టమర్లకు కచ్చితమైన వివరాలను అందించడం, క్లెయిమ్‌లను త్వరగా బీమా కంపెనీలు నిర్వహిస్తాయి. ఈ చర్య బీమా రంగంపై కస్టమర్లకు మరింత విశ్వాసాన్ని పెంచుతుంది.