CNG vs Petrol Cars:కారు అంటే గతంలో డీజిల్ లేదా పెట్రోల్‌తో మాత్రమే నడిచేది. కానీ, ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ కార్లతోపాటు సీఎన్‌జీ (CNG) కార్లు కూడా రోడ్లపై దూసుకెళ్తున్నాయి. మరి ఇప్పడు కారు కొనుగోలు చేయాలంటే ఏది బెస్ట్? సీఎన్‌జీ కారు కొంటే మంచిదా? పెట్రోల్ కారు తీసుకుంటే బాగుంటుందా? అనే విషయంలో చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు. మరి వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గత కొన్నేళ్లుగా సీఎన్‌జీ(కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) కార్ల అమ్మకాలు దేశంలో విపరీతంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడం, ఎలక్ట్రిక్ కార్లు పూర్తిగా అందుబాటులోకి రాని కారణంగా సీఎన్‌జీ కార్లవైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. అలాగే పెట్రోల్‌తో నడిచే కార్లతో పోలిస్తే సీఎన్‌జీ కార్లకు నిర్వహణ ఖర్చు (Maintenance) చాలా తక్కువ. అలాగే పర్యావరణ ప్రేమికులు సైతం సీఎన్‌జీ వేరియంట్లపై ఆసక్తి చూపుతున్నారు. గతంలో చిన్న, మధ్యతరహా సీఎన్‌జీ వేరియంట్ కార్ల సేల్స్ పెరిగాయి. అయితే ఇప్పుడు ఎస్యూవీ (SUV)ల్లో కూడా సీఎన్‌జీ వేరియంట్ కార్లు వచ్చేశాయి.
సీఎన్‌జీ వేరియంట్లపై ఆసక్తి!
పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే సీఎన్‌జీ ధర తక్కువగా ఉంటుంది. అలాగే పెట్రోల్‌తో సీఎన్‌జీ కార్లు నడుస్తాయి. సీఎన్‌జీ అందుబాటులో లేని సమయంలో పెట్రోల్‌తో కూడా సీఎన్‌జీ కార్లను నడపొచ్చు. ఈ సదుపాయం వల్ల సీఎన్‌జీ వేరియంట్ కార్లపై వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు.