CNG Cars Precautions In Summer Season :CNG కార్లు వినియోగిస్తున్నవారు ఎండకాలంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే ఊహించని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి వేసవిలో సీఎన్‌జీ కార్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ట్యాంక్ పూర్తిగా నింపకండి :
పెట్రోల్ బంకులు ఉన్నన్ని ఎక్కువగా CNG గ్యాస్ స్టేషన్లు లేవు. అందుకే.. సీఎన్‌జీ కారు ఉన్నవారు గ్యాస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు దాదాపు ట్యాంక్ ఫుల్ చేయిస్తుంటారు. అయితే.. సమ్మర్‌లో పూర్తిగా ట్యాంక్‌లో గ్యాస్ ఫిల్ చేయించకూడదని నిపుణులు చెబుతున్నారు. 80 శాతం లోపు గ్యాస్ ఫిల్ చేయించడం మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే.. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత వల్ల గ్యాస్ ఎక్కువగా వ్యాకోచిస్తుంది. అలాంటప్పుడు ట్యాంక్ నిండా గ్యాస్ ఉండడం వల్ల.. ట్యాంక్‌పై ప్రెషర్ పడుతుంది. దీనివల్ల ఒక్కోసారి ట్యాంక్ పేలిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
CNG కార్స్‌పై భారీ డిస్కౌంట్స్ - ఏ మోడల్‌పై ఎంతంటే?
కారు ఎండలో ఉంచవద్దు :
సమ్మర్‌లో ఎండలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి, మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు మీ సీఎన్‌జీ కారును ఎండలో పార్క్ చేయడం సురక్షితం కాదు. దీనివల్ల కారు వేడెక్కి, ట్యాంక్‌లోని ఇంధనం కూడా వేడెక్కుతుంది. కాబట్టి, మీరు కారును ఎక్కడైనా చెట్లు, నీడ ఉండే ప్రదేశంలో పార్క్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్స్‌పైరీ డేట్ చెక్ చేయండి :
మనం ఉపయోగించే ప్రతి వస్తువుకూ కూడా ఒక ఎక్స్‌పైరీ డేట్ కచ్చితంగా ఉంటుంది. కాబట్టి, ముందు జాగ్రత్తగా మీ సీఎన్‌జీ ట్యాంక్ ఎక్స్‌పైరీ డేట్ ను ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీ ట్యాంక్ ఎక్స్‌పైరీ డేట్ దగ్గరకు వస్తుంటే.. అజాగ్రత్తగా ఉండకుండా దానిని మార్చాలని నిపుణులు చెబుతున్నారు. నిపుణులు అభిప్రాయం ప్రకార.. సీఎన్‌జీ కిట్ ఎక్స్‌పైరీ డేట్ 15 సంవత్సరాల వరకు ఉంటుందట.
ఈ టెస్ట్ చేయించండి :
మీరు చాలా కాలం నుంచి సీఎన్‌జీ కారును వాడుతున్నట్లయితే.. వేసవి కాలంలో ట్యాంక్‌ను తప్పనిసరిగాచెక్చేయండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ట్యాంక్‌కు హైడ్రో పరీక్ష చేయించాలి. దీనివల్ల ట్యాంక్‌లో ఏదైనా లీకేజీ అందా అనే విషయం తెలుసుకోవచ్చు. అలాగే ఈ టెస్ట్ చేయడం ద్వారా ప్రెషర్ బేరింగ్ సామర్థ్యాన్ని కూడా తెలుసుకోవచ్చట. ఒకవేళ మీ సిలిండర్ తుప్పు పట్టినట్లు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్యాంక్‌ను మార్చాలని సూచిస్తున్నారు.
ఆథరైజ్డ్ డీలర్ ద్వారా సీఎన్‌జీ కిట్ కొనండి :
నేడు మార్కెట్లో చాలా చోట్ల నకిలీ వస్తువులను అమ్ముతున్నారు. కాబట్టి, మీరు కారులోనిసీఎన్‌జీ కిట్‌ను కొత్తది ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే ఆథరైజ్డ్ డీలర్ వద్ద మాత్రమే కిట్‌ను కొనుగోలు చేయండి. వారు మంచి కిట్‌ను అందించడంతో పాటు దానికి వారంటీ కూడా అందిస్తారు.
పెట్రోల్ - సీఎన్‌జీ, ఈ రెండిట్లో ఏ కారు మంచిది?
Tata Waiting Period October 2023 : టాటా కారు బుక్ చేశారా?.. డెలివరీకి ఇంకా ఎంత కాలం వెయిట్ చేయాలంటే..