తెలంగాణ

telangana

ETV Bharat / business

మంచి మైలేజ్ ఇచ్చే కారు కొనాలా? రూ.7 లక్షల బడ్జెట్లోని టాప్​-10 మోడల్స్ ఇవే! - BEST CARS UNDER 7 LAKH

ఇండియన్​ మార్కెట్లో మంచి ఫీచర్స్, స్పెషిఫికేషన్స్​తో రూ.7 లక్షల బడ్జెట్లో ఉన్న టాప్-10 కార్స్​ ఇవే!

Cars
Cars (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2024, 5:24 PM IST

Best Cars Under 7 Lakh : ప్రస్తుత కాలంలో కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే కారు తప్పనిసరి అయిపోయింది! ఎందుకంటే బైక్​పై ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ మంది ప్రయాణించలేరు. అందుకే తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్, ఫీచర్లు ఉన్న కారు కొనాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఇలాంటి వారి కోసం ప్రస్తుతం ఇండియన్​ మార్కెట్లో రూ.7 లక్షల బడ్జెట్​​లో మంచి ఈవీ, పెట్రోల్, డీజిల్​ కార్లు లభిస్తున్నాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. Tata Nano EV :భారత మార్కెట్లోకి త్వరలో 'టాటా నానో ఈవీ' లాంఛ్ కానుంది. ఈ కారు ధర రూ.5 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.

  • సీటింగ్ కెపాసిటీ - 4
  • ఫ్యూయల్ టైప్ - ఎలక్ట్రిక్
  • బ్యాటరీ కెపాసిటీ - 40kWh
  • రేంజ్ - 300 కి.మీ
  • ఎయిర్ బ్యాగులు - 2
  • ఫీచర్లు - ఎయిర్ కండిషనర్, పవర్ విండోస్, ఫ్రంట్ వీల్ డ్రైవ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్

2. Renault KWID :రెనో క్విడ్ కారు ధర రూ.4.7 లక్షల నుంచి రూ.6.45 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 999 సీసీ పెట్రోల్​ ఇంజిన్ ఉంటుంది. ఇది 67.07bhp పవర్, 91Nm టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఒక లీటరు పెట్రోల్​కు 22.3 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

  • సీటింగ్ కెపాసిటీ - 5
  • ఫ్యూయల్ టైప్ - పెట్రోల్
  • ఇంజిన్ కెపాసిటీ - 999 సీసీ
  • ఎయిర్ బ్యాగులు - 2
  • ఫీచర్లు - ఆండ్రాయిడ్ ఆటోప్లే, 8అంగుళాల ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఫోల్డబుల్ రియర్ సీట్, కీలెస్ ఎంట్రీ, రివర్స్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్

3. Maruti Suzuki Alto K10 :మారుతి సుజుకి కారు ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 998 సీసీ పెట్రోల్​ ఇంజిన్ ఉంటుంది. ఇది 65.71 bhp పవర్, 89Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఒక లీటరు పెట్రోల్​కు 24.9 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

  • సీటింగ్ కెపాసిటీ - 5
  • ఫ్యూయల్ టైప్ - పెట్రోల్
  • ఇంజిన్ కెపాసిటీ - 998 సీసీ
  • ఎయిర్ బ్యాగులు - 2
  • ఫీచర్లు - ఆండ్రాయిడ్ ఆటోప్లే, కీలెస్ ఎంట్రీ, 7అంగుళాల ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, ఎయిర్ కండిషనర్

4. Hyundai Casper :హ్యుందాయ్ కాస్పర్​ కారు ధర రూ.6 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 999 సీసీ పెట్రోల్​ ఇంజిన్ ఉంటుంది. ఇది 99.24 bhp పవర్, 172 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. బడ్జెట్​లో కారు కొనాలకునేవారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది.

  • సీటింగ్ కెపాసిటీ - 5
  • ఫ్యూయల్ టైప్ - పెట్రోల్
  • ఇంజిన్ కెపాసిటీ - 999 సీసీ
  • ఎయిర్ బ్యాగులు - 2
  • ఫీచర్లు - హిల్ స్టార్ట్ అసిస్ట్, ఈఎస్​పీ, ఎయిర్ కండిషనర్, పవర్ విండోస్, ఫ్రంట్ వీల్ డ్రైవ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్

5. Tata Punch :టాటా పంచ్ కారు లీటరుకు 18.8 కి.మీ మైలేజ్​ను ఇస్తుంది. ఈ కారులో 1199 సీసీ పెట్రోల్​ ఇంజిన్ ఉంటుంది. ఇది 86.6 bhp పవర్, 115 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ధర రూ.6.13 లక్షల నుంచి రూ.10.2 లక్షల వరకు ఉంటుంది.

  • సీటింగ్ కెపాసిటీ - 5
  • ఫ్యూయల్ టైప్ - పెట్రోల్
  • ఇంజిన్ కెపాసిటీ - 1199 సీసీ
  • ఎయిర్ బ్యాగులు - 2
  • ఫీచర్లు - సన్​రూఫ్, 7అంగుళాల ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రెయిన్ సెన్సింగ్ వైపర్, ఆటో ఏసీ, క్రూయిజ్ కంట్రోల్

6. Renault Triber :రెనో ట్రైబర్ కారులో 999 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 71.02 bhp పవర్, 96Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ధర రూ.6 లక్షల నుంచి రూ.8.97 లక్షల వరకు ఉంటుంది.

  • సీటింగ్ కెపాసిటీ - 7
  • ఫ్యూయల్ టైప్ - పెట్రోల్
  • ఇంజిన్ కెపాసిటీ - 999 సీసీ
  • ఎయిర్ బ్యాగులు - 4
  • ఫీచర్లు - 8 అంగుళాల ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, వైర్​లెస్ ఛార్జింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్

7. Tata Tiago :టాటా టియాగో కారు ధర రూ.6.65 లక్షల నుంచి రూ.8.90 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 1199 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 84.48 bhp పవర్, 113Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు లీటరుకు 19 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

  • సీటింగ్ కెపాసిటీ - 5
  • ఫ్యూయల్ టైప్ - పెట్రోల్
  • ఇంజిన్ కెపాసిటీ - 1199 సీసీ
  • ఎయిర్ బ్యాగులు - 2
  • ఫీచర్లు - 7అంగుళాల ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రెయిన్ సెన్సింగ్ వైపర్, ఆటో ఏసీ, ఆటోమేటిక్ హెడ్‌ ల్యాంప్స్, రివర్స్ కెమెరా

8. Nissan Magnite :నిస్సాన్ మాగ్నైట్ కారు ధర రూ.6 లక్షల నుంచి రూ.11.27 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 999 సీసీ టర్బో ఇంజిన్ ఉంటుంది. ఇది 98.63 bhp పవర్, 152Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు లీటరుకు 17.4 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

  • సీటింగ్ కెపాసిటీ - 5
  • ఫ్యూయల్ టైప్ - పెట్రోల్
  • ఇంజిన్ కెపాసిటీ - 999 సీసీ
  • ఎయిర్ బ్యాగులు - 2
  • ఫీచర్లు - 360°డిగ్రీ వ్యూ కెమెరా, 8 అంగుళాల ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, వైర్​లెస్ ఛార్జింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో ఏసీ

9. Citroen C3 :సిట్రోయెన్ సీ3 మోడల్ కారు ధర రూ.6.16 లక్షల నుంచి రూ.8.96 లక్షల వరకు ఉంటుంది. దీనిలో 1199 సీసీ ఇంజిన్​ ఉంటుంది. ఇది 108.62 bhp పవర్, 190Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు లీటరుకు 19.3 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

  • సీటింగ్ కెపాసిటీ - 5
  • ఫ్యూయల్ టైప్ - పెట్రోల్
  • ఇంజిన్ కెపాసిటీ - 1199 సీసీ
  • ఎయిర్ బ్యాగులు - 2
  • ఫీచర్లు - 10.24 అంగుళాల ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, రివర్స్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్

10. MG Comet EV :ఎంజీ కామెట్ ఈవీ కారు ధర రూ.6.98 లక్షల నుంచి రూ.9.23 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 17.3 కిలోవాట్​ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 230 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.

  • సీటింగ్ కెపాసిటీ - 5
  • ఫ్యూయల్ టైప్ - ఎలక్ట్రిక్
  • బ్యాటరీ కెపాసిటీ - 17.3kWh
  • ఎయిర్ బ్యాగులు - 2
  • ఫీచర్లు - 10.24 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ, రివర్స్ కెమెరా

మీ ఫ్యామిలీ కోసం మంచి కారు కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్‌-9 మోడల్స్ ఇవే!

రూ.90వేల బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే!

ABOUT THE AUTHOR

...view details