Cars Discounts In January 2025 :పండగల రోజుల్లో చాలా మంది కొత్త వాహనాలు కోనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వారిని దృష్టిలోనే ఉంచుకుని వివిధ కార్ల కంపెనీలు భారీ డిస్కౌంట్స్‌ను వినియోగదారులకు అందిస్తున్నాయి. జనవరిలో మారుతీ, టాటా, హోండా సంస్థలు ఇచ్చే డిస్కౌంట్ల గురించి తెలుసుకుందాం.
ప్రముఖ కారు తయారీ సంస్థ మారుతి సుజుకీ తమ ప్రొడక్ట్‌లపై ఈ పండగ సీజన్లో పలు ఆఫర్లు ప్రకటించింది. ఎర్టిగా, కొత్త జనరేషన్ డిజైర్ కార్లు తప్ప మిగతా వాటికి ఈ ఆఫర్లు ప్రకటించింది. ఇందులో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్, స్పెషల్ ఎడిషన్ కిట్స్ ఉన్నాయి. ఈ ఏడాది విడుదలైన మోడల్స్‌పై కూడా డిస్కౌంట్లు ఇస్తోంది. 2024లో రిలీజ్ అయిన కార్లకు కూడా మంచి క్యాష్ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
ఆల్టో కే10పై
Maruti Suzuki Alto K10 Offers : మారుతి ఈసారి మారుతి ఆల్టో కే10పై అత్యధిక ఆఫర్లు అందిస్తోంది. మీరు మన్యూవల్ లేదా సీఎన్జీ వేరియంట్లు కొనాలనుకుంటే(మోడల్ ఇయర్-MY 24) రూ.5000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు మొత్తం రూ.62,000 బెనిఫిట్స్ పొందొచ్చు. ఇక MY 25పై రూ.47,100 బెనిఫిట్స్ పొందొచ్చు. ఈ ఆల్టో కే10 ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల వరకు ఉంటుంది. (ధర దిల్లీ ఎక్స్-షోరూమ్)
ఎస్ప్రెసో
ఎస్ప్రెసో సీఎన్జీ, మాన్యువల్‌పై క్యాష్ బెనిఫిట్స్ రూ.5000. MY 24 యూనిట్లపై మొత్తం రూ.62,100, MY 25 యూనిట్లపై రూ.47,100 బెనిఫిట్స్ పొందొచ్చు. అయితే వేరియంట్లనుబట్టి ఆఫర్లు ఉంటాయి. ఈ కారు ధర రూ.4.27 లక్షల నుంచి రూ.6.12 లక్షల వరకు ఉంటుంది.
వ్యాగన్ ఆర్
వ్యాగన్ ఆర్ సీఎన్జీ, మాన్యువల్‌పై రూ.30,000 క్యాష్ బెనిఫిట్స్, MY 24 యూనిట్స్‌పై మొత్తం రూ.57,100 బెనిఫిట్స్ లభిస్తోంది. ఇక MY 25 యూనిట్స్‌పై రూ.15,000 క్యాష్ బెనిఫిట్స్, మొత్తం రూ.57,100 డిస్కౌంట్స్ ఇస్తున్నారు. అయితే అన్ని వేరియంట్లపై స్క్రాపేజ్, కార్పొరేట్ బోనస్‌పై ఒకే విధంగా ఉన్నాయి. ఈ కారు ధర రూ.5.54 లక్షల నుంచి రూ.7.20 లక్షల వరకు ఉంటుంది.
స్విప్ట్
Maruti Suzuki Car Discounts 2025 : ఓల్డ్ జనరేషన్ స్విఫ్ట్ అటోమేటిక్, మాన్యువల్ వేరియంట్లకు ఒకే రకమైన బెనిఫిట్స్ లభిస్తున్నాయి. అయితే సీఎన్జీ వేరియంట్ కార్లకు క్యాష్ డిస్కౌంట్ లేదు. కానీ ఎక్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లు ఉన్నాయి. ఈ కారు ధర రూ.6.24 లక్షల నుంచి రూ.9.14 లక్షల వరకు ఉంటుంది. ఇక కొత్త జనరేషన్ స్విఫ్ట్ కూడా అటోమేటిక్, మాన్యువల్ వేరియంట్లకు ఒకే రకమైన బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో సీఎన్జీ వేరియంట్‌పై MY24 యూనిట్స్‌కు 35,000, MY25 యూనిట్స్‌కు 15,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ కారు ధర రూ.6.49 లక్షల నుంచి రూ.9.59 లక్షల వరకు ఉంటుంది.