Car Mileage Increasing Tips :పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ కాలంలో, మంచి మైలేజ్ఇచ్చే కారు కొనుగోలు చేయడం చాలా మంచిది. కొనాలనుకుంటాం. బడ్జెట్ కాస్త ఎక్కువైనా మంచి ఇంధన సామర్థ్యం కలిగిన వాహనం కొనుగోలు చేయడమే బెటర్‌గా ఉంటుంది. అంతేకాదు కారు డ్రైవ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే చాలు, మీ కారు మైలేజ్ అద్భుతంగా పెరుగుతుంది. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. స్టడీ స్పీడ్ కొనసాగించాలి!
చాలా మంది కార్లో విపరీతమైన వేగంతో వెళ‌్తుంటారు. మరికొందరు చాలా స్లోగా వెళ్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఎక్కువగా ఇంధనం ఖర్చవుతుంది. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక స్థిరమైన వేగాన్ని పాటించాలి. ముఖ్యంగా లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు, ఓపెన్ రోడ్లపై వెళుతున్నప్పుడు, వీలైనప్పుడల్లా క్రూయిజ్ కంట్రోల్ ఉపయోగించాలి.
2. అదనపు బరువు తొలగించాలి!
అదనపు బరువు ఇంధన వినియోగాన్ని పెంచుతుంది. కాబట్టి మీరు ప్రయాణం చేసేటప్పుడు, మీ వాహనంలో ఏవైనా బరువైన, అవసరం లేని వస్తువులుంటే, వాటిని తీసేయాలి. హైవేలపై వెళ్లేటప్పుడు అవసరం లేకపోతే విండోస్, రూఫ్‌టాప్‌లను క్లోజ్ చేయాలి.
3. టైర్లలో సరిపడా గాలి ఉండేలా చూసుకోవాలి!
టైర్లలో ఎప్పుడూ సరిపడా గాలి ఉండేలా చూసుకోవాలి. తక్కువ గాలి ఉంటే ఘర్షణ ఎక్కువగా ఉండి, టైర్ వేగంగా తిరగదు. దీని వల్ల కారు నడవడానికి అధిక ఇంధనం కావాల్సి వస్తుంది. కనుక ఎప్పటికప్పుడు మీ కారు టైర్ల ప్రెజర్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలి. కంపెనీ సిఫార్సుల మేరకు టైర్లలో ఎయిర్ ప్రెజర్‌ను మెయింటెన్ చేయాలి.
4. ఇంజిన్ ఆఫ్ చేయాలి
కారు పార్కింగ్‌లో ఉన్నప్పుడు లేదా సిగ్నల్‌లో వెయిట్ చేస్తున్నప్పుడు ఇంజిన్‌ను ఆఫ్ చేసుకోవాలి. ఇంజిన్ ఆన్‌లో ఉంచుకోవడం వల్ల అనవసరంగా ఫ్యూయెల్ ఖర్చయిపోతుంది. పైగా కాలుష్య ఉద్గారాలు వెలువడుతూ ఉంటాయి.