Car Loan Interest Rates In India 2024 : నేడు భారతదేశంలో కార్లు కొనేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2024 జనవరి నెలలో దేశవ్యాప్తంగా దాదాపుగా 3.94 లక్షల కార్లు సేల్ అయ్యాయని గణాంకాల ద్వారా స్పష్టం అవుతోంది. దేశంలోని మధ్య తరగతి ప్రజల ఆదాయాలు గణనీయంగా పెరుగుతుండడమే ఇందుకు కారణం. దీనికి తోడు నేడు చాలా బ్యాంకులు వాహనాల కొనుగోలుకు విరివిగా రుణాలు అందిస్తున్నాయి. దీనితో చేతిలో డబ్బులు లేకపోయినా, వాహనాల కొనుగోలు సులభం అయిపోయింది.
మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే చాలు
Credit Score For Car Loan : క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారికి తక్కువ వడ్డీకే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. సాధారణంగా చాలా బ్యాంకులు కారు ఆన్-రోడ్ ధరలో 80 శాతం నుంచి 90 శాతం వరకు రుణాన్ని ఇస్తున్నాయి. అయితే ఇలాంటి వాహన రుణాలు తీసుకునే ముందు ప్రాసెసింగ్ ఫీజులు, రీపేమెంట్ ఛార్జీలు, ఇతర రుసుములు గురించి కూడా ఆరా తీయాలి. అన్నింటికంటే ముఖ్యంగా బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్ల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే మీపై అధిక రుణభారం పడకుండా ఉంటుంది. అందుకే ఈ ఆర్టికల్లో వివిధ బ్యాంకులు కారు రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీ రేట్లు గురించి తెలుసుకుందాం.
Bank Interest Rates On Car Loans :
బ్యాంకు పేరు | వడ్డీ రేటు (సంవత్సరానికి) |
కెనరా బ్యాంక్ | 8.70% |
యూనియన్ బ్యాంక్ | 8.70% |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 8.75% |
పంజాబ్ నేషనల్ బ్యాంక్ | 8.75% |
బ్యాంక్ ఆఫ్ ఇండియా | 8.75% |
బ్యాంక్ ఆఫ్ బరోడా | 8.80% |
ఐడీబీఐ బ్యాంక్ | 8.80% |
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ | 8.85% |
ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 8.85% |
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ | 8.95% |
కర్ణాటక బ్యాంక్ | 8.98% |
ఐసీఐసీఐ బ్యాంక్ | 9.10% |
యాక్సిస్ బ్యాంక్ | 9.20% |
సౌత్ ఇండియన్ బ్యాంక్ | 9.27% |
కరూర్ వైశ్యా బ్యాంక్ | 9.55% |
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ | 10.70% |