తెలంగాణ

telangana

ETV Bharat / business

దీపావళి స్పెషల్‌ - నవంబర్‌ 1న 'ముహురత్​ ట్రేడింగ్' - ఒక గంట మాత్రమే!

బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో నవంబర్‌ 1న ముహురత్ ట్రేడింగ్‌ - మరి మీరు సిద్ధమా?

By ETV Bharat Telugu Team

Published : 9 hours ago

Updated : 8 hours ago

Muhurat Trading
Muhurat Trading (Getty Images)

Muhurat Trading 2024 Date :బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు దీపావళి పండుగ నాడు (నవంబర్‌ 1న) ముహురత్ ట్రేడింగ్ నిర్వహించనున్నాయి. కొత్త సంవత్‌ 2081 ప్రారంభానికి గుర్తుగా దీపావళి నాడు ఒక గంట సేపు ప్రత్యేకంగా ఈ ముహురత్ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తాయి.

2024 ముహురత్‌ ట్రేడింగ్‌ టైమ్స్‌
దీపావళి రోజు స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. కానీ సాయంత్రం పూట ప్రత్యేకంగా ముహురత్ ట్రేడింగ్ జరగనుంది.

  • మార్కెట్‌ ఓపెన్‌ - సాయంత్రం 6 గంటలకు
  • మార్కెట్‌ క్లోజ్‌ - సాయంత్రం 7 గంటలకు
  • ట్రేడ్‌ మాడిఫికేషన్‌ ముగింపు సమయం - సాయంత్రం 7:10 గంటలకు

విజయం వరిస్తుంది!
దీపావళి రోజున ఏ పని ప్రారంభించినా విజయం వరిస్తుందని భారతీయుల విశ్వాసం. అందుకే ఈ పర్వదినాన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తే, వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందని చాలా మంది విశ్వసిస్తారు. అందుకే దీపావళి రోజున ప్రత్యేకంగా ముహురత్ ట్రేడింగ్‌లో పాల్గొనేందుకు ఇష్టపడుతుంటారు.

ముహురత్ ట్రేడింగ్ మొదటగా 1957లో బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో ప్రారంభించారు. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ స్థాపించిన 1992లోనే, ఎన్‌ఎస్‌ఈలో ముహురత్‌ ట్రేడింగ్ కూడా ప్రారంభమైంది. సంపదకు, ధనానికి దేవత అయిన లక్ష్మీ దేవిని పూజిస్తూ, కొత్త సంవత్సరంలో ముహురత్‌ ట్రేడింగ్‌ చేయడాన్ని హిందువులు సంప్రదాయంగా ఆచరిస్తూ వస్తున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ముహురత్​ను మంచి సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో చేసిన పని మంచి ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు. ట్రేడింగ్ ప్రారంభమవగానే కొత్త హిందూ సంవత్సరం ప్రారంభమైనట్లు పరిగణిస్తారు. ఈ గంట సమయంలో ట్రేడింగ్ చేసిన వారికి సంవత్సరం మొత్తం ఎక్కువ లాభాలు వస్తాయని ఒక నమ్మకం ఉంది. ఈ సమయంలో కొంత మొత్తంలో కొనుగోలు చేయటం ద్వారా లక్ష్మీ దేవి ఆశీర్వాదం ఇస్తుందని కొంత మంది నమ్ముతుంటారు.

ఆల్‌ సెగ్మెంట్స్‌!
ప్రీ-ఓపెనింగ్ సెషన్‌ సాయంత్రం 5:45 గంటల నుంచి 6:00 గంటల వరకు ఉంటుంది. ఇక ట్రేడింగ్‌ చేసేవాళ్లకు ఇంట్రాడే పొజీషన్లు 15 నిమిషాలకు ముందే ముగుస్తాయి. ఈ ముహురత్ ట్రేడింగ్‌లో ఈక్విటీ, కమోడిటీ డెరివేటివ్స్‌, కరెన్సీ డెరివేటివ్స్‌, ఈక్విటీ ఫ్యూచర్స్‌ & ఆప్షన్స్‌, సెక్యూరిటీ లెండింగ్‌ & బారోయింగ్ లాంటి వివిధ విభాల్లో ట్రేడింగ్ జరుగుతుంది.

Last Updated : 8 hours ago

ABOUT THE AUTHOR

...view details