Best Upcoming Ev Scooters In India :ప్రస్తుత కాలంలో మార్కెట్లో హవా అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్‌దే. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, వాతావరణ కాలుష్యం తదితర కారణాల దృష్ట్యా వినియోగదారులు ఈవీల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వాలు సైతం వీటికి మంచి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఇక విషయానికొస్తే భారత వాహన మార్కెట్లోకి త్వరలో కొత్త మోడల్ ఈవీ స్కూటర్లు అందుబాటులోకి రానున్నాయి. సుజుకీ, టీవీఎస్ లాంటి ప్రధాన వాహన తయారీ సంస్థలతో పాటు మరికొన్ని కంపెనీలు తమ నూతన ఈవీ మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశ పెట్టనున్నాయి. వాటి వివరాలు మీ కోసం.
TVS Electric Scooter
ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ త్వరలోనే తన కొత్త మోడల్ ఈవీ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ iQube ST వేరియంట్ మోడల్
కోసం కస్టమర్లు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు.
Ather Rizta
ఏథర్ రిజ్టా మరో ఆరు నెలల్లో తన నూతన ఈవీ స్కూటర్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురానుంది సంస్థ. ఇది తన చివరి మోడల్ ఏథర్ రిజ్టా 450 కంటే మరింత మెరుగ్గా ఉండనున్నట్లు సమాచారం.
Honda Activa-Based Electric Scoote
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలోనే మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. 2040 నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న హోండా కంపెనీ ఆ లక్ష్యం దిశగా ఎలక్ట్రిక్ వాహనాలు తయారీ ప్రారంభించింది.