Best Two Wheelers Under 1 Lakh : భారతదేశంలో టూ-వీలర్స్‌కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు లేటెస్ట్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్‌తో, అదిరిపోయే డిజైన్స్‌తో బైక్‌లను, స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేసుకుని, ఎక్కువ మైలేజ్ ఇచ్చే టూ-వీలర్స్‌ను తెస్తున్నాయి. అందుకే ఈ ఆర్టికల్‌లో రూ.1 లక్ష బడ్జెట్లో లభిస్తున్న టాప్-9 బైక్స్ & స్కూటర్స్ గురించి తెలుసుకుందాం.
1. TVS Jupiter 110 : టీవీఎస్ జూపిటర్ 110 ఇటీవలే భారత మార్కెట్లో లాంఛ్ అయ్యింది. త్వరలోనే దీని డెలివరీ స్టార్ట్ అవుతుందని కంపెనీ స్పష్టం చేసింది. తక్కువ ధరలో మంచి స్కూటీ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ స్కూటర్ 4 వేరియంట్లలో, 6 రంగుల్లో లభిస్తుంది.
ఈ టీవీఎస్ జూపిటర్‌లో 113.33 సీసీ బీఎస్6 ఇంజిన్ ఉంటుంది. ఇది 7.91 బీహెచ్పీ పవర్, 9.8 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. దీనిలో ఫ్రంట్ సైజ్ డిస్క్ బ్రేక్‌లు, వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.1 లీటర్లు.
TVS Jupiter 110 Price :మార్కెట్లో ఈ టీవీఎస్ జూపిటర్ 110 స్కూటీ ధర రూ.77,092 నుంచి రూ.89,834 (ఎక్స్-షోరూం) ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
2. TVS Raider 125 :ఈ టీవీఎస్ రైడర్ 125 బైక్ 4 వేరియంట్లలో, 11 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్‌లో 124.8 సీసీ బీఎస్6 ఇంజిన్ ఉంటుంది. ఇది 11.2 బీహెచ్పీ పవర్, 11.2 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ మోటార్ 5-స్పీడ్ ట్రాన్స్మిషన్ అనుసంధానంతో పనిచేస్తుంది. ముందువైపు డిస్క్ బ్రేక్‌లు, వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు. ఈ బైక్ 56.7 కి.మీ/లీటర్ మైలేజ్ ఇస్తుంది.
TVS Raider 125 :మార్కెట్లో ఈ టీవీఎస్ రైడర్ 125 బైక్ ధర సుమారుగా రూ.97,066 నుంచి రూ.1,07,414 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
3. Bajaj Freedom : తక్కువ బడ్జెట్లో మంచి బైక్ కొనాలని అనుకునేవారికి బజాజ్ ఫ్రీడమ్ మంచి ఛాయిస్ అవుతుంది. ఇది 3 వేరియంట్లలో, 7 రంగుల్లో లభిస్తుంది. ఈ బైక్‌లో 125 సీసీ బీఎస్6 ఇంజిన్ ఉంది. ఇది 9.3 బీహెచ్పీ పవర్, 9.7 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ సీఎన్జీ బైక్ మైలేజ్ 90 కి.మీ/ లీటర్.
Bajaj Freedom Price :మార్కెట్లో ఈ బజాజ్ ఫ్రీడమ్ బైక్ ధర సుమారుగా రూ.95,055 నుంచి రూ.1,10,055 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
4. Hero Xtreme 125 R :హీరో కంపెనీ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ బైక్‌లలో ఎక్స్ట్రీమ్ 125 ఆర్ ఒకటి. ఈ బైక్ 2 వేరియంట్లలో, 3 అందమైన రంగుల్లో లభిస్తుంది. దీనిని ప్రధానంగా యువతను ఆకట్టుకునేందుకు యూత్‌ఫుల్ స్టైలింగ్‌తో రూపొందించారు.
ఈ హీరో ఎక్స్ట్రీమ్ 125 ఆర్ బైక్‌లో 124.7 సీసీ బీఎస్6 ఇంజిన్ ఉంటుంది. ఇది 11.4 బీహెచ్పీ పవర్, 10.5 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది యాంటీ-లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు. దీని మైలేజ్ 66 కి.మీ/ లీటర్.
Hero Xtreme 125 R Price : మార్కెట్లో ఈ హీరో ఎక్స్ట్రీమ్ 125 ఆర్ బైక్ ధర సుమారుగా రూ.97,484 నుంచి రూ.1,02,870 వరకు ఉంటుంది.