తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ బైక్ మైలేజ్ తగ్గిపోయిందా? డోంట్ వర్రీ - ఈ 5 టిప్స్​ మీ కోసమే!

మీ బైక్ మైలేజ్ పెరగాలా? ఈ టాప్​-5 టిప్స్ మీ కోసమే!

Bikes
Bikes (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2024, 9:57 PM IST

How To Increase Bike Mileage :నేడు మన జీవితంలో బైక్​లు నిత్యావసర ప్రయాణ సాధనంలా మారిపోయాయి. విద్యార్థులు కాలేజ్​కు వెళ్లాలన్నా, ఉద్యోగులు ఆఫీస్​కు చేరుకోవాలన్నా బైక్ ఉండాల్సిందే. అసలు ఏ పని కోసమైనా బైక్​పై వెళ్లాల్సిందే. అయితే చాలా మంది బైక్ నడిపేటప్పుడు తెలిసీ, తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని వల్లబైక్​ మైలేజ్ బాగా తగ్గిపోతుంది. దీనితో తమ బండి కంపెనీ వాళ్లు చెప్పిన మైలేజ్ ఇవ్వట్లేదు అని వాపోతుంటారు. మరి మీ బైక్​​ కూడా ఇలానే తక్కువ మైలేజ్ ఇస్తోందా? అయితే మీరేమీ చింతించకండి. కొన్ని చిట్కాలు పాటిస్తే, మీ బైక్ మైలేేజ్​ను బాగా పెంచుకోవచ్చని, ఇంధనం ఖర్చులు కూడా ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆ టిప్స్​ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

  1. గేర్ షిఫ్టింగ్ : సరైన సమయంలో గేర్లు మార్చకపోతే, బైక్ మైలేజ్ క్రమంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే టూ-వీలర్ నడిపేటప్పుడు మీ వేగానికి తగినట్లుగా గేర్స్​ మార్చుతూ ఉండాలి. అలాకాకుండా, చాలా వేగంగా వెళ్తూ, తక్కువ గేర్ ఉపయోగిస్తే అది ఇంజిన్​ పనితీరును ప్రభావితం చేస్తుంది. పైగా ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది.​ కనుక మీ బైక్​ మంచి మైలేజ్ ఇవ్వాలంటే, మీ స్పీడ్​కి, రోడ్డు పరిస్థితికి అనుగుణంగా గేర్స్ మారుస్తూ ఉండాలి. ఖాళీగా ఉన్న రోడ్లపై స్పీడ్​గా వెళ్తున్నప్పుడు టాప్ గేర్​లో వెళ్లాలి. నిదానంగా బైక్ డ్రైవ్​ చేస్తుంటే సెకండ్ లేదా థర్డ్​ గేర్​లో వెళ్లాలి. ఇలా వెళ్లడం వల్ల రోడ్డు మధ్యలో బైక్ ఆగకుండా, మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది. పైగా మైలేజ్ కూడా పెరుగుతుంది.
  2. క్వాలిటీ ఆయిల్ మాత్రమే వాడాలి : మీ బైక్​లో ఎప్పుడూ క్వాలిటీ ఆయిల్ మాత్రమే వేయాలి. చాలా బంకుల్లో పెట్రోల్​ను కల్తీ చేస్తుంటారు. దీని వల్ల మీ ఇంజిన్ దెబ్బతింటుంది. మైలేజ్ తగ్గుతుంది. పైగా పొల్యూషన్ కూడా పెరుగుతుంది. అందుకే మంచి నమ్మకమైన పెట్రోల్ బంక్​ దగ్గర నుంచి క్వాలిటీ ఆయిల్​ను వేసుకోవాలి. అంతేకాదు ఇంజిన్​ ఆయిల్​ కూడా మంచిది మాత్రమే వాడాలి. దీని వల్ల కచ్చితంగా మైలేజ్ పెరుగుతుంది.
  3. బ్రేక్‌పై కాలు పెట్టి డ్రైవ్ చేయవద్దు : చాలా మంది బ్రేక్​ పెడల్​పై కాలు పెట్టి డ్రైవ్ చేస్తుంటారు. సేఫ్టీ పరంగా ఇది మంచిదే. కానీ డ్రైవ్ చేసేటప్పుడు ఇలా బ్రేక్​ పెడల్​పై కాలు పెడితే, దానిపై కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. దీని వల్ల కూడా మీ బైక్ మైలేజ్ తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల అవసరమైనప్పుడు మాత్రమే బ్రేక్​ పెడల్​పై కాలు పెట్టండి.
  4. టైర్​ ప్రెజర్ చెక్ చేయాలి : చాలా మంది తమ బైక్​ టైర్లలో ఎంత ఎయిర్​ ప్రెజర్​ ఉందో చెక్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటని నిపుణులు చెబుతున్నారు. బైక్​ టైర్లలో సరైనంత ఎయిర్ ప్రెజర్ లేకపోతే, అది మీ బండి మైలేజ్​పై కచ్చితంగా ప్రభావం చూపుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. టైర్లలో ఉండాల్సినంత ఎయిర్ ప్రెజర్​ లేకపోతే, మీరు ఎంత యాక్సిలరేట్ చేసినా, బైక్​ వేగం పెరగదు. పైగా ఇంధనం కూడా అదనంగా ఖర్చు అవుతుంది. కనుక తరచుగా మీ బండి టైర్లలోని ఎయిర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలి. అప్పుడే మీ బైక్ మైలేజ్ పెరుగుతుంది. ఫ్యూయెల్ వేస్టేజ్ తగ్గుతుంది.
  5. సర్వీసింగ్​​ : మీ బైక్​ మంచి కండిషన్​లో ఉండాలంటే, క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి. ఎయిర్ ఫిల్టర్​ను శుభ్రం చేయాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద చాలా సేపు వేచి ఉండాల్సి వస్తే, బైక్​ను పూర్తిగా ఆపేయాలి. ఈ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే, మీ బైక్ మైలేజ్ పెరగడం గ్యారెంటీ అని నిపుణులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details