Best Penny Stocks In 2024 : పెన్నీ స్టాక్ 'లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ' (LME) మదుపరులకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. 2021 మార్చిలో రూ.11లుగా ఉన్న ఈ షేర్ వాల్యూ ఇప్పుడు రూ.673.70కు చేరుకుంది. అంటే కేవలం మూడేళ్లలోనే షేర్ వాల్యూ 6000 శాతం పెరిగింది.
విజయ ప్రస్థానం!
2021 మార్చిలో లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ షేర్ వాల్యూ కేవలం రూ.11 మాత్రమే ఉండేది. కానీ మొదటి ఏడాదిలోనే 136 శాతం వృద్ధితో రూ.284.70కు ఎగబాకింది. అయితే 2023 ఏప్రిల్ 25 నాటికి షేర్ వాల్యూ రూ.277.40లతో 52 వారాల కనిష్ఠానికి పడిపోయింది. కానీ తరువాత క్రమంగా పుంజుకున్న ఈ స్టాక్ అంచెలంచెలుగా వృద్ధి చెందుతూ 2024 ఏప్రిల్ 12 నాటికి రూ.710.50కు పెరిగింది. మదుపరులకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ - బిజినెస్ వివరాలు
ఎల్ఎంఈ కంపెనీ ముంబయిలో 1977లో ప్రారంభమైంది. ఇది స్పాంజ్ ఐరెన్ ఉత్పత్తులను తయారు చేసి, విక్రయిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఈ కంపెనీ స్పాంజ్ ఐరెన్, పవర్, మైనింగ్ అనే మూడు సెగ్మెంట్లను ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఇది చార్, ఫ్లై యాష్, ఈఎస్పీ డస్ట్, బెడ్ మెటీరియల్స్, ఐరెన్ ఓర్ ఫైన్స్ లాంటి బై-ప్రొడక్టులను కూడా విక్రయిస్తూ ఉంటుంది.
బోర్డ్ ఆఫ్ లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ గత నెలలో 'క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్' (క్యూఐపీ) ద్వారా రూ.5 వేల కోట్ల వరకు నిధులు సేకరించాలని నిర్ణయించింది. ఈ నిధులను విడతల వారీగా సేకరించే అవకాశం ఉంది.