Best Off Road Bikes In India :మీరు ఎప్పుడైనా ఆఫ్ రోడ్ బైక్‌ల గురించి విన్నారా? వీటినే డర్ట్ బైక్‌లు, స్క్రాంబ్లర్లు అని కూడా అంటారు. సాధారణ బైక్‌లతో వెళ్లలేని ప్రాంతాలకు కూడా వీటిపై హాయిగా వెళ్లిపోవచ్చు. అంటే సాధారణ రోడ్లపై కాకుండా ఇసుక, కంకర, బురద, మంచు, నదీ ప్రవాహాల్లో కూడా వీటిని సులువుగా డ్రైవ్ చేయవచ్చు. అందుకే వీటిని ఆఫ్ రోడ్ బైక్స్ అని అంటారు. ఇవి రగ్గడ్ లుక్స్‌తో, హెవీగా ఉంటాయి. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అద్భుతంగా ఉంటుంది. సాహసాలు చేయాలని అనుకునేవారికి, టూ-వీలర్‌పై దేశమంతా చుట్టిరావాలని అనుకునేవారికి ఇవి ఎంతో అనువుగా ఉంటాయి. కాకపోయే వీటి ధరలు భారీగా ఉంటాయి. మరి మీకు ఇలాంటి బైక్‌లు అంటే చాలా ఇష్టమా? అయితే మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
1. Hero XPulse 200 4V :హీరో కంపెనీ 2019లో ఈ XPulse 200 4V బైక్‌ను లాంఛ్ చేసింది. సాహస యాత్రలు చేసేవారికి ఇది ఎంతో బాగుంటుంది. రగ్గడ్, రొబస్ట్ లుక్‌తో, రైడర్‌కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. దీనిలో ఉన్న లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్ వల్ల ఎలాంటి కఠినమైన ప్రాంతాల్లోనైనా దీనిని చాలా సులువుగా డ్రైవ్ చేయవచ్చు. ఈ బైక్‌లో నాబీ టైర్స్ ఉంటాయి కనుక సుపీరియర్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. అంతేకాదు దీనికి వాటర్ వేడింగ్ కేపబిలిటీస్ ఉన్నాయి. కనుక బురదలోనూ, నీళ్లలోనూ దీనిని ఈజీగా డ్రైవ్ చేయవచ్చు. దీనిలోని పవర్ఫుల్ ఇంజిన్‌కు రక్షణ కల్పించేందుకు స్కిడ్ ప్లేట్స్ కూడా ఉంటాయి. ఈ టూ-వీలర్ 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- ఇంజిన్ : 199.6 సీసీ
- మ్యాక్స్ పవర్ : 18.90 bhp
- మ్యాక్స్ టార్క్ : 17.38 Nm
- మైలేజ్ : 40 కి.మీ/ లీటర్
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 13.0 లీటర్స్
- గేర్స్ : 5 స్పీడ్
- బ్రేక్స్ : డిస్క్/ డిస్క్
- స్టార్టింగ్ మెకానిజమ్ : సెల్ఫ్/ కిక్ స్టార్ట్
- వీల్ టైప్ : స్పోక్ వీల్స్
- బాడీ టైప్ : ఆఫ్ రోడ్
- ధర : రూ.1.44 లక్షలు - రూ.1.51 లక్షలు
2. Royal Enfield Himalayan : రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ రగ్గడ్, వెర్సటైల్ అడ్వంచర్ మోటార్ సైకిల్. ఇది ఆన్-రోడ్, ఆఫ్ రోడ్ రైడింగ్‌లకు సపోర్ట్ చేస్తుంది. దీని బిల్ట్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. అందుకే ఇది బైక్ ప్రియులను ఎంతో ఆకర్షిస్తూ ఉంటుంది. దీనిలో స్టర్డీ ఛాసిస్, లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంటాయి. అంతేకాదు దీనిలో అనేక లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పొడవైన విండ్ స్క్రీన్, హై-మౌంటెడ్ ఫ్రంట్ ఫెండర్, డ్యూయెల్-పర్పస్ టైర్స్ ఉంటాయి. కనుక ఎలాంటి కఠినమైన ప్రాంతాల్లోనైనా దీనిని చాలా హాయిగా డ్రైవ్ చేయవచ్చు. ఇది మొత్తం 6 కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
- ఇంజిన్ : 411.0 సీసీ
- మ్యాక్స్ పవర్ : 24.30 bhp
- మ్యాక్స్ టార్క్ : 32 Nm
- మైలేజ్ : 45 కి.మీ/ లీటర్
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 15.0 లీటర్స్
- గేర్స్ : 5 స్పీడ్
- బ్రేక్స్ : డిస్క్/ సింగిల్ పిస్టన్ ప్లోటింగ్ కాలిపర్
- స్టార్టింగ్ మెకానిజమ్ : సెల్ఫ్ స్టార్ట్
- వీల్ టైప్ : స్పోక్ వీల్స్
- బాడీ టైప్ : ఆఫ్ రోడ్
- ధర : రూ.2.16 లక్షలు - రూ.2.24 లక్షలు
3. Suzuki V-Strom SX 250 :సుజుకి గిక్సర్ 250ను ఆధారంగా చేసుకుని ఈ 'వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ 250' బైక్‌ను రూపొందించారు. ఈ ఎంట్రీ-లెవెల్ అడ్వెంటర్ స్పోర్ట్ బైక్ చూడడానికి చాలా స్టైలిష్ లుక్‌లో ఉంటుంది. ఇది సింగిల్ వెర్షన్లో, 3 అందమైన రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 249.0 సీసీ
- మ్యాక్స్ పవర్ : 26 bhp
- మ్యాక్స్ టార్క్ : 22.20 Nm
- మైలేజ్ : 35 కి.మీ/ లీటర్
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 12 లీటర్స్
- గేర్స్ : 6 స్పీడ్
- బ్రేక్స్ : డిస్క్/ డిస్క్
- స్టార్టింగ్ మెకానిజమ్ : సెల్ఫ్ స్టార్ట్
- వీల్ టైప్ : అల్లాయ్ వీల్స్
- బాడీ టైప్ : ఆఫ్ రోడ్
- ధర : రూ.2.12 లక్షలు
4. BMW R 1250 GS :బీఎండబ్ల్యూ ఇండియాలో విడుదల చేసిన బెస్ట్ బైక్ ఇది. దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు తగ్గట్టే బెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. దీనిపై రైడింగ్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇది మొత్తం 4 రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 1254.0 సీసీ
- మ్యాక్స్ పవర్ : 134 bhp
- మ్యాక్స్ టార్క్ : 143 Nm
- మైలేజ్ : 21 కి.మీ/ లీటర్
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 20 లీటర్స్
- గేర్స్ : 6 స్పీడ్
- బ్రేక్స్ : డ్యూయెల్ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్స్/ సింగిల్ డిస్క్ బ్రేక్
- స్టార్టింగ్ మెకానిజమ్ : ఎలక్ట్రిక్ స్టార్ట్
- వీల్ టైప్ : కాస్ట్ అలూమినం వీల్స్
- బాడీ టైప్ : ఆఫ్ రోడ్
- ధర : రూ.20.55 లక్షలు
5. Triumph Tiger 1200 :బడ్జెట్ గురించి లెక్క చేయకుండా, సూపర్ స్పోర్టీ లుక్స్ ఉన్న బైక్ కొనాలని అనుకునేవారికి ఈ ట్రయంఫ్ టైగర్ 1200 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మస్క్యులర్ బాడీతో ఉండే ఈ బైక్‌ను రైడ్ చేయాలంటే రైడర్ కూడా చాలా బలంగా ఉండాలి.
- ఇంజిన్ : 1160 సీసీ
- మ్యాక్స్ పవర్ : 148 bhp
- మ్యాక్స్ టార్క్ : 130 Nm
- మైలేజ్ : 18 కి.మీ/ లీటర్
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 20/30 లీటర్స్
- గేర్స్ : 6 స్పీడ్
- బ్రేక్స్ : డ్యూయెల్ డిస్క్/ డిస్క్
- స్టార్టింగ్ మెకానిజమ్ : సెల్ఫ్ స్టార్ట్
- వీల్ టైప్ : స్పోక్ వీల్స్
- బాడీ టైప్ : ఆఫ్ రోడ్
- ధర : రూ.19.19 లక్షలు - రూ.21.69 లక్షలు
6. KTM 250 Adventure : మీడియం బడ్జెట్లో అడ్వెంచర్ బైక్ కొనాలని అనుకునేవారికి 'కేటీఎం 250 అడ్వెంచర్' బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది ఆఫ్ రోడ్లపైనే కాదు, సాధారణ రోడ్లపై కూడా డ్రైవ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది రెండు భిన్నమైన రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 248 సీసీ
- మ్యాక్స్ పవర్ : 29.60 bhp
- మ్యాక్స్ టార్క్ : 24 Nm
- మైలేజ్ : 35 కి.మీ/ లీటర్
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 14.5 లీటర్స్
- గేర్స్ : 6 స్పీడ్
- బ్రేక్స్ : డిస్క్/ డిస్క్
- స్టార్టింగ్ మెకానిజమ్ : సెల్ఫ్ స్టార్ట్
- వీల్ టైప్ : అల్లాయ్ వీల్స్
- బాడీ టైప్ : ఆఫ్ రోడ్
- ధర : రూ.2.42 లక్షలు - రూ.2.47 లక్షలు